CPI Narayana: పుష్ప–2’ ఏం  సందేశమిచ్చింది... నారాయణ ఫైర్‌

ABN, Publish Date - Dec 22 , 2024 | 04:11 PM

పుష్ప2’ (Pushpa 2) బెనిఫిట్‌ షో, రేవతి (Revati Death) మరణంపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటన ఘోరమని ఆయన అన్నారు.

'పుష్ప2’ (Pushpa 2) బెనిఫిట్‌ షో, రేవతి (Revati Death) మరణంపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటన ఘోరమని ఆయన (CPI Narayana) అన్నారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందతున్న ఆమె కుమారుడు శ్రీతేజ్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. పుష్ప –2 సినిమా టికెట్‌ రేటు పెంపకం, బెనిఫిట్‌ షో అనుమతి ఇవ్వడం పట్ల నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్‌ చేశారు.

‘‘పుష్ప సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్‌ చేసుకోవాలని సందేశం ఇస్తోందా? స్మగ్లింగ్‌తోపాటు అసభ్యకరమైన పాటలు ఆ చిత్రంలో పెట్టారు. ప్రభుత్వం సిగ్గు లేకుండా టికెట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అదేమన్నా సమాజానికి ఉపయోగపడే సినిమానా? ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించాలి. దీనిలో పోలీసుల తప్పేం లేదు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్‌లో ఇలా జరగకుండా ఉండేందుకు సినిమా వర్గాలు, కళాకారులు, రాజకీయ నేతలు చర్యలు చేపట్టాలి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. త్వరలో మా వంతు సాయం ప్రకటిస్తాం’’ అని నారాయణ ఆ వీడియోలో పేర్కొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 04:12 PM