Kannappa: చేప‌కు ఈత‌, పులికి వేట‌, కోకిల‌కు పాట నేర్పిన గుగ్గురువులు.. ‘పిల‌క.. గిల‌క’

ABN, Publish Date - Sep 30 , 2024 | 03:38 PM

ఎప్ప‌టిలానే ఈ సోమ‌వారం కూడా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వ‌స్తున్న‌ భ‌క్త క‌న్న‌ప్ప నుంచి ఓ ప్ర‌త్యేక అప్డేట్ వ‌చ్చింది. ఈ మూవీలో హ‌స్య పాత్ర‌ల్లో న‌టించిన బ్ర‌హ్మానందం, స‌ప్త‌గిరిల‌కు సంబంధించిన పోస్ట‌రు రిలీజ్ చేసి వారి ఘ‌న‌త‌ను తెలిపారు.

kannappa

ఎప్ప‌టిలానే ఈ సోమ‌వారం కూడా మంచు విష్ణు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్టుగా వ‌స్తున్న‌ భ‌క్త క‌న్న‌ప్ప (Kannappa Movie) నుంచి ఓ ప్ర‌త్యేక అప్డేట్ వ‌చ్చింది. ఇప్ప‌టికే సుమారు రెండు మాసాలుగా ప్ర‌తి సోమ‌వారం సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన వారికి సంబంధించి క్యారెక్ట‌ర్ల‌ను రివీల్ చేస్తూ చిత్రంలో వారి పేర్ల‌ను వారి వృత్తుల గురించి తెలియ‌జేస్తూ విడుద‌ల చేసిన పోస్ట‌ర్లకు మంచి స్పంద‌న రావ‌డంతో పాటు సినిమాపై మంచి అంచ‌నాలను క్రియేట్ చేసింది.

ఈ క్ర‌మంలో తాజాగా ఈ సోమ‌వారం క‌న్న‌ప్ప (Kannappa Movie) మూవీలో హ‌స్య పాత్ర‌ల్లో న‌టించిన‌ బ్ర‌హ్మానందం, స‌ప్త‌గిరిల‌కు సంబంధించిన పోస్ట‌రు రిలీజ్ చేసి వారి ఘ‌న‌త‌ను తెలిపారు. ఈ సంద‌ర్భంగా ‘చేప‌కు ఈత‌, పులికి వేట‌, కోకిల‌కు పాట నేర్పిన గుగ్గురువులు పిల‌క.. గిల‌క అడ‌వికి పాఠాలు’ చెప్ప‌డానికి వ‌స్తే అంటూ విడుద‌ల చేసిన పోస్ట‌ర్ ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో బాగా వైర‌ల్ అవుతోంది. ఇదిలాఉండ‌గా ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల, ఐశ్వ‌ర్య‌, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, టిక్కి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లు ఆక‌ట్టుకున్నాయి.

ఈ సినిమాకు మ‌హా భార‌తం సీరియ‌ల్ డైరెక్ట‌ర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండ‌గా అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహ‌న్‌బాబు నిర్మిస్తున్నాడు. డిసెంబర్‌లో ఈ సినిమా పాన్‌ ఇండియా వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మోహ‌న్‌లాల్‌, మోహ‌న్‌బాబు, శివ రాజ్ కుబార్‌ ప్ర‌భాస్‌, ప్రీతి ముకుంద‌న్ వంటి తార‌లు కీల‌క పాత్ర‌లు పోషించారు.

Updated Date - Sep 30 , 2024 | 03:52 PM