Sandeep Weds Chandini: కిస్సిక్.. కలర్‌పుల్ ఫొటో వచ్చింది
ABN, Publish Date - Dec 07 , 2024 | 02:02 PM
‘కలర్ ఫొటో’ (Colour Photo) దర్శకుడు సందీప్ రాజ్ (Sandeep Raj) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ చాందినీరావును (Chandini Rao) ఆయన వివాహం చేసుకున్నారు.
‘కలర్ ఫొటో’ (Colour Photo) దర్శకుడు సందీప్ రాజ్ (Sandeep Raj) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ చాందినీరావును (Chandini Rao) ఆయన వివాహం చేసుకున్నారు. తిరుమల వేదికగా శనివారం వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఈ వేడుకకు హీరో సుహాస్, వైవా హర్ష తదితరులు హాజరై సందడి చేశారు. అభిమానులు, నెటిజన్లు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘కలర్ ఫొటో’లో చాందినీ రావు కీలక పాత్ర పోషించారు. సినిమా చిత్రీకరణ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు సందీప్‌రాజు షార్ట్ ఫిల్మ్‌లతో కెరీర్ ప్రారంభించారు. (Colour Photo director Sandeep Raj marries actress Chandini rao)