CM Revanth Reddy: గద్దర్ అవార్డ్ ప్రతిపాదన పెట్టాం.. అయినా పట్టించుకోలేదు
ABN, Publish Date - Jul 30 , 2024 | 02:25 PM
తెలుగు చలనచిత్ర పరిశ్రమ టాలీవుడ్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి స్పందన లేకపోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ టాలీవుడ్(Tollywood) పై సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్ (Gaddar awards) అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి స్పందన లేకపోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రతిష్ట్టాత్మక నంది అవార్డులను గద్దర్ అవార్డులతో భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ కొత్త కార్యక్రమాన్ని ఎలా సమర్థవంతంగా అమలు చేయాలనే దానిపై అభిప్రాయాన్ని, సూచనలను అందించాలని తెలుగు చిత్ర పరిశ్రమను సీఎం రేవంతరెడ్డి కోరారు. అయితే ఈ విషయంపై సినీ పరిశ్రమ మౌనంగా ఉందని ఆయన అన్నారు.
ప్రముఖ తమిళ రచయిత, ఉద్యమకారుడు శివశంకరికి ‘విశ్వంభర డాక్టర్ సి. నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం’ ప్రదానం సందర్భంగా రేవంత రెడ్డి కామెంట్స్ చేశారు. "తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులను ప్రకటించాం. దీనిపై కార్యచరణ సిద్ధం చేయమని పరిశ్రమను కోరాం. సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం బాధాకరం’’ అని ముఖమంత్రి (Revanth reddy Fire on Film industry) అన్నారు.