Sandhya Theatre Stampede: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Dec 21 , 2024 | 03:13 PM

‘పుష్ప 2’ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు అసలు ఏం జరిగిందో.. సీఎం మాటల్లో..

CM Revanth Reddy

సంథ్య థియేటర్ ఘటనపై విచారణ జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో పోలీసుల వైఫల్యం లేదని అన్నారు. పోలీసులు హెచ్చరించినా.. హీరో సినిమా చూడడానికి వచ్చారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీసులు ఎలాంటి లాఠీఛార్జ్ చేయదు, అక్కడ రోడ్ షో చేయడంతోనే తోపులాట జరిగింది. హీరో రోడ్ షో చేయకుండా వెళ్లిపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండి ఉండేది. అల్లు అర్జున్ బౌన్సర్లు ఫ్యాన్స్‌ను తోచేశారు. వారు ఫ్యాన్స్‌ను తోయడంతోనే అక్కడ తోపులాట జరిగింది. కన్న బిడ్డ చేతిని పట్టుకుని ఓ తల్లి చనిపోయింది. ప్రస్తుతం ఆ బిడ్డ కోమాలో ఉండి చికిత్స పొందుతున్నాడు.

థియేటర్‌ లోపల బాల్కనీలో హీరో కూర్చుంటే కింద నుంచి హీరోపై ఎగపడే ప్రయత్నం చేశారు. పోలీసులను హీరో దగ్గరకు వెళ్లకుండా థియేటర్ యాజమాన్యం అడ్డుకుంది. పోలీసులు హీరోకు సమాచారం ఇవ్వకుండా బౌన్సర్లు అడ్డుకున్నారు. హీరోకు సమాచారం ఇచ్చినా సినిమా పూర్తయ్యే వరకు బయటకు వెళ్లబోనని హీరో చెప్పారని పోలీస్ కమిషనర్ చెప్పారు.


బాధితులను ఆదుకోవడానికి సినీ ప్రముఖులు ఎవరూ ఆసక్తి చూపించలేదు. కానీ అల్లు అర్జున్ కోసం క్యూ కట్టిన సినీ ప్రముఖులు బాధితులను పరామర్శించడానికి ముందుకు రాలేదు. దీనిని బట్టి చూస్తుంటే అసలు సినీ ప్రముఖులు ఏం కోరుకుంటున్నారనేది నాకు అర్థం కావడం లేదు. అసలు అల్లు అర్జున్‌కు ఏమైంది.. అంతగా ఇంటికి క్యూ కట్టి నన్ను తిడుతున్నారు. అల్లు అర్జున్‌కు ఏమైనా కాలు విరిగిందా.. చెయ్యి విరిగిందా? ఎందుకు అంతగా పరామర్శిస్తున్నారు. సినిమా వాళ్లపై నాకు కోపం ఎందుకు ఉంటుంది? సినిమా వాళ్లు బాధ్యతగా వ్యవహరించాలి. అల్లు అర్జున్ అంశాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు. నేను సీఎంగా ఉన్నంత వరకు బెనిఫిట్ షోలకు, టికెట్ ధరల పెంపుకు అనుమతులు ఇవ్వను. సినిమా వాళ్లు వ్యాపారాలు చేసుకోండి. ప్రాణాలతో చెలగాటం ఆడితే మాత్రం చూస్తూ ఊరుకోం‌మని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు.

Also Read-Vidudala Part2: విజయ్ సేతుపతి ‘విడుదల పార్ట్ 2’ ఎలా ఉందంటే..


అంతకు ముందు తెలంగాణ శాసనసభలో అల్లు అర్జున్ ప్రస్తావన తీసుకొచ్చాయి విపక్ష పార్టీలు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ ఘటనలో ఓ మహిళా చనిపోయింది. 9 ఏళ్ల బాలుడు ప్రాణం కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. హీరో మాత్రం అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్తున్నాడు. అల్లు అర్జున్ బాధ్యతా రహితంగా వ్యవహరించారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అంటూ ఆగ్రహంగా మాట్లాడారు.

Also Read-UI Movie Review : ఉపేంద్ర నటించిన UI మూవీ ఎలా ఉందంటే..

Also Read-Rewind 2024: ఈ ఏడాది అగ్ర హీరోల మెరుపులు ఏమాత్రం..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 21 , 2024 | 03:39 PM