Jr NTR: యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి, నారా లోకేష్ కృతజ్ఞతలు

ABN, Publish Date - Sep 03 , 2024 | 04:52 PM

రెండు తెలుగు రాష్ట్రాలలో సంభవించిన వరద విపత్తు ఉపశమనం నిమిత్తం మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రూ. కోటి విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తారక్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన విశ్వక్సేన్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ విద్యాశాఖామంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

CM Revanth Reddy, Jr NTR and Nara Lokesh

రెండు తెలుగు రాష్ట్రాలలో సంభవించిన వరద విపత్తు ఉపశమనం నిమిత్తం మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రూ. కోటి విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు.. మొత్తం రూ. కోటి రూపాయలను ఎన్టీఆర్ విరాళంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయనిధిగా విరాళం ప్రకటించిన ఎన్టీఆర్‌కు అలాగే విశ్వక్సేన్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy), ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖామంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

Also Read- Balakrishna: తెలుగు రాష్ట్రాలకు బాలయ్య బాబు భారీ విరాళం


భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహాయంగా మేమున్నామంటూ అగ్ర నటుడు నందమూరి తారక రామారావు (Jr NTR).. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్)కి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తారక్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే రూ. 5 లక్షల విరాళం అందించిన హీరో విశ్వక్సేన్‌ (Vishwak Sen)‌కు కూడా సీఎం కృతజ్ఞతలు తెలిపారని తెలంగాణ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అధికారిక ట్విట్టర్ ప్రకటించింది.


ఏపీ విద్యాశాఖామంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా.. ‘‘ధన్యవాదాలు తారక్.. వరదల వల్ల సంభవించిన ఈ విధ్వంసం నుండి ప్రజలు కోలుకోవడంలో మీ ఈ సహకారం ఉంతో దోహదపడుతుంది’’ అని ఎన్టీఆర్‌కు, ‘‘ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు మీరందించిన సహకారం వరదబాధితులైన అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు ఎంతగానో దోహదపడుతుంది.. థ్యాంక్యూ విశ్వక్సేన్’’ అని విశ్వక్సేన్‌కు నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

Also Read-Tollywood: తెలుగు రాష్ట్రాలకు అండగా చిత్ర పరిశ్రమ.. ఎవరెవరు ఎంతెంత విరాళం ఇచ్చారంటే..


అంతకుముందు.. ‘‘భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వ‌ర‌ద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక రూ. 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను’’ అంటూ ఎన్టీఆర్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా రూ. కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే విశ్వక్సేన్ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 5 లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు.

Read Latest Cinema News

Updated Date - Sep 03 , 2024 | 04:52 PM