Christmas Releases: కన్నప్ప వర్సెస్ అల్.. క్రిస్మస్‌కి పెద్ద వార్

ABN, Publish Date - Oct 16 , 2024 | 06:02 PM

వాస్తవానికి ఇంట్రెస్టింగ్ కథలు బయటికొస్తుండటంతో ఈ సారి క్రిస్మస్ కూడా చాలా స్పెషల్ గానే కనిపిస్తుంది. మరోవైపు జనాల్లో, సోషల్ మీడియాలో ఎంతో హైప్ ఎక్కించిన మరో రెండు పాన్ ఇండియన్ సినిమాలు కూడా రిలీజ్ కానుండటంతో ఈ క్రిస్మస్ మరింత స్పెషల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.

ఈ సారి సినిమా పోటీలు సంక్రాంతి కన్న ముందే స్టార్ట్ అయ్యాయి. క్రిస్మస్ కానుకగా పాన్ ఇండియా సినిమాలతో పాటు టాలెంటెడ్ డైరెక్టర్ల చిన్న సినిమాలు కూడా రిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. వాస్తవానికి ఇంట్రెస్టింగ్ కథలు బయటికొస్తుండటంతో ఈ సారి క్రిస్మస్ కూడా చాలా స్పెషల్ గానే కనిపిస్తుంది. మరోవైపు జనాల్లో, సోషల్ మీడియాలో ఎంతో హైప్ ఎక్కించిన మరో రెండు పాన్ ఇండియన్ సినిమాలు కూడా రిలీజ్ కానుండటంతో ఈ క్రిస్మస్ మరింత స్పెషల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.


మొదటగా హీరో నితిన్ నటిస్తోన్న యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకుడు. ఆస్ట్రేలియన్ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాని డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు.


మోహనకృష్ణ ఇంద్రగంటి(Indraganti Mohan krishna), శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న చిత్రo 'సారంగపాణి జాతకం'(Sarangapani Jathakam). ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించారు. ఈ సినిమాని కూడా 20న రిలీజ్ చేయనున్నారు.


ఒక వైపు భారీ సినిమాలను రూపొందిస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యభరిత చిత్రాలను అందిస్తూ ఘన విజయాలను సాధిస్తోంది టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments). ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి (Gowtham Tinnanuri) దర్శకత్వంలో ‘మ్యాజిక్‌’ అనే సినిమాను సితార సంస్థ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మ్యూజికల్ డ్రామాలో ఎందరో నూతన నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రంతో ప్రేక్షకులకు మరపురాని థియేట్రికల్ అనుభూతిని అందించడానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ‘మ్యాజిక్‌’ చిత్రానికి సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు. బుధవారం అనిరుధ్ పుట్టినరోజు సందర్భంగా, నిర్మాతలు చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. క్రిస్మస్ కానుకగా 21 డిసెంబర్, 2024న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ రిలీజ్ డేట్ పోస్టర్ ఎంతో సృజనాత్మకంగా ఉండటమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

నాగచైతన్య(Naga Chaitanya), లేడీ పవర్‌స్టార్‌ సాయి పల్లవి (Sai pallavi)రెండోసారి తెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరూ జంటగా 'తండేల్‌' (Thandel) సినిమా తెరకెక్కుతోంది. చందు మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాస్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు.


కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర (Kannada Super Star Upendra) స్వీయ దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘యూఐ ది మూవీ’ (UI The Movie). లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ అండ్ వీనస్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్లపై కెపీ శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలను పెంచేసింది. యూనిక్ టీజర్‌తో వీక్షకులను ఫాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్ళారు ఉపేంద్ర. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


ఇక మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. టాలీవుడ్ ప్రెస్టీజీయస్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న ‘కన్నప్ప’ చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వంటివారంతా భాగమైన సంగతి తెలిసిందే. ‘కన్నప్ప’ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా తెరకెక్కుతోంది. ఎంతో అంకితభావంతో విష్ణు మంచు ఈ పాత్రను పోషిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలపై మేకర్స్ దృష్టి పెట్టనున్నారు. డిసెంబర్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Oct 16 , 2024 | 06:03 PM