Jani Master: జానీ మాస్టర్ విడుదలయ్యారు

ABN, Publish Date - Oct 25 , 2024 | 05:44 PM

అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ శుక్రవారం హైదరాబాద్ చంచల్ గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదల అయ్యారు. దీంతో ఆయన ఫ్యామిలీలో సంతోషం నెలకొంది.

Jani Master

అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Choreographer Jani Master) శుక్రవారం హైదరాబాద్ చంచల్ గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదల అయ్యారు. హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 36 రోజుల తర్వాత చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్ బెయిల్‌తో బయటికి వచ్చారు. జానీ మాస్టర్ జైలు నుంచి బయటికి రావడంతో ఆయన కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇదిలాఉండ‌గా.. ప‌ది రోజుల క్రితం నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్‌కు రంగారెడ్డి కోర్టు ఐదు రోజుల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. కానీ ఫొక్సో చ‌ట్టం కింద జానీ మాస్ట‌ర్ అరెస్టు అయిన నేప‌థ్యంలో ఆయ‌న‌కు వ‌చ్చిన అవార్డును క‌మిటీ తాత్కాలికంగా నిలిపివేయ‌డంతో త‌న‌కు వ‌చ్చిన బెయిల్‌‌ను ర‌ద్దు చేసుకుని జానీ మాస్ట‌ర్ జైలుకు వెళ్లిపోయారు. ఈ నేప‌థ్యంలోనే ఈ సారి హైకోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేయ‌గా తెలంగాణ హైకోర్టు.. రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది.

Also Read-Unstoppable With NBK: బాలయ్య పండుగకు సెలవు కావాలి.. ఇదేందయ్యా ఇది


అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కుంటున్న జానీ మాస్టర్‌‌ను గత నెలలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గోవాలో జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్‌ తీసుకుని హైదరాబాద్‌‌కు తరలించారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఉప్పర్‌పల్లిలోని 13వ అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు హాజరుపరిచారు. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి, ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. అక్టోబరు 3వ తేదీ వరకు (14 రోజుల) రిమాండ్‌ విధించారు.

అలాగే జానీ మాస్టర్‌ను కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలవగా.. నాలుగు రోజుల పాటు కస్టడీ విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చింది. దీంతో జానీమాస్టర్‌ను నాలుగు రోజుల పాటు నార్సింగ్ పోలీసులు విచారించారు. పోలీసుల కస్టడీలో బాధితురాలే తనను వేధింపులకు గురి చేసిందంటూ జానీ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ అంశానికి సంబంధించి జానీ మాస్టర్ భార్య సుమలత ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేసింది. ఇలా నడుస్తున్న ఈ కేసులో ప్రస్తుతం జానీ మాస్టర్‌ బెయిల్‌పై విడుదలయ్యారు.

Also Read-CID: బుల్లితెర ఆడియెన్స్‌కి గుడ్ న్యూస్.. రెండు దశాబ్దాలు స్మాల్ స్క్రీన్‌ని ఏలిన షో వచ్చేసింది

Also Read-Mahesh Babu: నువ్వు కాపాడిన 3772వ ప్రాణం సామీ..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 25 , 2024 | 05:46 PM