Jani Master: జానీ మాస్టర్ కు సమాచారం లేకుండానే ఎన్నికలు 

ABN, Publish Date - Dec 09 , 2024 | 11:00 AM

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు (Jani Master) ఊహించని షాక్ తగిలింది. జానీ మాస్టర్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి.

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు (Jani Master) ఊహించని షాక్ తగిలింది. జానీ మాస్టర్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి అధ్యక్షులుగా జానీ మాస్టర్ (Choreographer Jani Master) ఉన్న విషయం తెలిసిందే. గుట్టు చప్పుడు కాకుండా అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు అసోసియేషన్ సభ్యులు జానీ మాస్టర్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అసోసియేషన్ నుంచి తొలగించినట్లు జానీ మాస్టర్‌‌పై తప్పుడు ప్రచారం జరుగుతోందని... తనను ఏ అసోసియేషన్ తొలగించలేదని జానీ మాస్టర్ చెబుతున్నారు. అసోసియేషన్ కోసం తీసుకున్న భూ వివాదంలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. శంకర్ పల్లిలో డ్యాన్సర్ అసోసియేషన్ కోసం 9 ఎకరాలు భూమి కొనుగోలు చేశారని, భూమి కొనుగోలు సమయంలో పలువురు కోట్ల రూపాయలు స్కామ్ చేశారని... స్కామ్ మొత్తం బయటకు తీస్తునందుకే తనపై ఆరోపణలు వచ్చాయని జానీ మాస్టర్‌ అంటున్నారు. (Choreographers Association election)

డ్యాన్సర్ అసోసియేషన్ కార్డుల జారీ విషయంలో భారీగా వసూళ్లకు పాల్పడ్డారని ప్రచారం జరుగుతోందిChoreographers Association scam). ఈ అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకే తనపై కుట్ర జరిగిందని జానీ మాస్టర్ ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా న్యాయస్థానాల్లో ఎదుర్కొంటానని జానీ మాస్టర్ తెలిపారు. అయితే అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న జానీ మాస్టర్ కొన్ని రోజుల క్రితం చంచల్ గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదల అయ్యారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంచల్ గూడ జైలు నుంచి మాస్టర్ బయటకు వచ్చారు. 36 రోజులు పాటు ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నారు.

Updated Date - Dec 09 , 2024 | 11:00 AM