Sri Simha Koduri: ఆ సినిమా కంటే రెట్టింపు ఎంటర్టైన్ చేస్తాం.. ఫ్రాంఛైజ్ కొనసాగిస్తాం
ABN, Publish Date - Sep 09 , 2024 | 05:17 PM
'మత్తు వదలరా' (Mathuvadalara) చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ 'మత్తువదలరా2'(Mathu Vadalara 2) ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతోంది.
'మత్తు వదలరా' (Mathuvadalara) చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ 'మత్తువదలరా2'(Mathu Vadalara 2) ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతోంది. శ్రీ సింహ కోడూరి (Srisimha Koduri) లీడ్ రోల్ లో తన సైడ్ కిక్ గా సత్య నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీ సింహ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
'మత్తు వదలరా 2' ప్రిపరేషన్ చాలా బాగా జరిగింది. గెటప్పు, క్యారెక్టర్స్ స్టయిలింగ్ మారింది. 'హీ' టీం ఏజెంట్స్ గా చూపించాం. ఫస్ట్ పార్ట్ కన్నా యాక్షన్ సీన్స్ ఎక్కువగా వుంటాయి. పార్ట్ 1 రిలీజై హిట్ అయిన తర్వాత సీక్వెల్ చేద్దామని నాకు, చెర్రీ గారికి ఉండేది. డైరెక్టర్ రితిష్ లాస్ట్ ఇయర్స్ స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ పార్ట్ లో వున్న క్యారెక్టర్స్ ఇందులోనూ ట్రావెల్ అవుతాయి. ఫస్ట్ పార్ట్ లో మర్డర్ ఎవరు చేశారు అనే ట్రాక్ తో పాటు డ్రగ్స్ ట్రాక్ వుంటుంది. ఇందులో కూడా ఆ రెండితో పాటు ఇంకొన్ని లేయర్స్ యాడ్ అవుతాయి. డెలివరీ బాయ్స్ నుంచి ఏజెంట్స్ ఎలా అయ్యారనే లింక్ చూపిస్తాం. సోషల్ మీడియాతో పరిచయం లేని ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసే కథ, క్యారెక్టర్స్ వుంటాయి. ఫన్, థ్రిల్ డబుల్ వుంటుంది. సినిమా హిట్ అయ్యిందని పార్ట్ 2 తీస్తే ఖచ్చితంగా ఒత్తిడి వుంటుంది. కానీ డైరెక్టర్ రితిష్ కి ఈ కథ ఫస్ట్ పార్ట్ కి మ్యాచ్ అయ్యేలా ఆర్గానిక్ గా వచ్చింది. అందుకే నేచురల్ గా అంతా సెట్ అయ్యింది. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ దే.
సినిమా అంట రెడీ అయ్యాక బయటకు రావాలనుకున్నాం. ఇదొక కొత్త స్ట్రాటజీ లా అనుకున్నాం. అనౌన్స్ చేస్తే బజ్ వస్తుంది. ఫస్ట్ పార్ట్ హిట్ కాబట్టి ఆడియన్స్ ఎక్సయిట్ అవుతారు. అయితే సినిమా పూర్తయి విడుదలకి వచ్చేసరికి దానిపై బజ్ తగ్గొచ్చు. ఎక్సయిట్మెంట్ పలచబడకముందే వేడివేడిగా వడించేయాలనే ఉద్దేశంలో ఇలా చేశాం. ఇప్పుడున్న బజ్ చూస్తుంటే మా స్ట్రాటజీ వర్క్ అయ్యిందనిపించింది. ఇటీవల ప్రభాస్ ట్రైలర్ విడుదల చేసారు, అయన టీజర్, ట్రైలర్ సాంగ్ చూసి చాలా ఎక్సయిట్ అయ్యారు. ఆయనకు జెన్యూన్ గా నచ్చితేనే అంత టైం స్పెండ్ చేస్తారు. అలాగే రాజమౌళి గారికి టీజర్, ట్రైలర్ చాలా నచ్చాయి. చాలా ఎంజాయ్ చేశారు. ప్రోడక్ట్ విషయంలో హ్యాపీగా ఉన్నారు.
సత్య, నా పాత్రల ఇందులో ఇంకా బావుంటాయి. ఇద్దరి కెమిస్ట్రీ ఫస్ట్ పార్ట్ లో నేచురల్ గా వచ్చింది. సూపర్ గా వర్క్ అయ్యింది. సెకండ్ పార్ట్ లో మేమిద్దరం త్రూ అవుట్ కనిపిస్తాం.
వెన్నెల కిశోర్ ఇందులో ఫస్ట్ పార్ట్ తో సంబంధం లేని క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఫరియా అబ్దుల్లా ఫన్నీ క్యారెక్టర్స్ కి బాగా సెట్ అవుతుంది. నేచురల్ గా తనలో ఫన్ వుంటుంది. ఇందులో తన పాత్ర యాక్షన్ కూడా వుంది. ఈ క్యారెక్టర్ కి ఫరియా యాప్ట్. ఈ సినిమాలో తను సాంగ్ రాయడంతో పాటు కొరియోగ్రాఫ్ చేసింది. అది ప్రమోషన్స్ కి బాగా యూజ్ అయ్యింది. ఫస్ట్ పార్ట్ ఎంత హిట్ అయ్యిందో దాని బీజీఎంకి కూడా అంత మంచి పేరు వచ్చింది. సెకండ్ పార్ట్ కి కూడా అలానే వస్తుందనే నమ్మకం వుంది. రితిష్ చాలా క్లారిటీ వున్న డైరెక్టర్. సినిమా విజన్ బోర్డ్ తన మైండ్ లో ఉంటుంది. ఈ సినిమాకు ఫ్రాంచైజ్ గా చేయాలనే వుంది. చేసే అవకాశం వున్న ఫ్రాంచైజ్ ఇది.