Ramya Pasupuleti: పాట చూస్తే 'మేడమ్ సార్ మేడమ్' అంటారంతే!
ABN, Publish Date - Aug 19 , 2024 | 05:00 PM
రావు రమేష్, ఇంద్రజ జంటగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ ( Maruthi Nagar Subramanyam). లక్ష్మణ్ కార్య (lakshman karya) దర్శకత్వం వహించారు. ఇందులో కథానాయికగా నటించిన రమ్య పసుపులేటి సినిమా గురించి ముచ్చటించారు
రావు రమేష్, ఇంద్రజ జంటగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ ( Maruthi Nagar Subramanyam). లక్ష్మణ్ కార్య (lakshman karya) దర్శకత్వం వహించారు. ఇందులో రావు రమేష్ (Rao ramesh)కుమారుడిగా అంకిత్ కొయ్య, అతని సరసన రమ్య పసుపులేటి నటించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. సుకుమార్ ్ఘ?భార్య తబిత సమర్పణలో ఈ శుక్రవారం సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా రమ్య పసుపులేటి (Ramya Pasupuleti) మీడియాతో మాట్లాడారు.
నాకు నాలుగైదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి యాడ్స్ చేస్తున్నాను. అనుష్క గారి ‘పంచాక్షరీ’లో బాలనటిగా చేశా. మహేష్ బాబు గారి ‘స్పైడర్’లోనూ ఓ రోల్ చేశా. ఆ తర్వాత చదువుకోవాలని గ్యాప్ తీసుకున్నాను. బ్యాచిలర్స్ పూర్తి చేశాక మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. ప్రజలకు చేరువ కావడానికి ఇంస్టాగ్రామ్ హెల్ప్ అయ్యింది. దర్శకుడు లక్ష్మణ్ కార్య నన్ను ఇన్స్టా లో చూసి ఆడిషన్ కు పిలిచారు. నా పెర్ఫార్మన్స్ నచ్చడంతో ఎంపిక చేశారు. ఇందులో నేను 18 ఏళ్ల అమ్మాయిగా నటించా. బబ్లీ, క్యూట్ అండ్ ఇన్నోసెంట్ అమ్మాయి. కొంచెం తింగరితనం ఉంటుంది. గ్లామర్, ట్రెడిషనల్ రెండు రకాలుగా తెరపై కనిపిస్తా. నాకు కామెడీ చేయడం చాలా ఇష్టం. ఈ సినిమాలో చాలా నవ్విస్తా. ఎమోషన్స్ కూడా బాగా పండిస్తా. క్యూట్ అండ్ క్రింజ్ లవ్ స్టోరీ ఇది. నవ్వించడం చాలా కష్టం. ప్రేక్షకుల్ని నవ్వించగలిగితే క్యారెక్టర్ పండినట్టు. ఇందులో నా పాత్ర ద్వారా నవ్వించే అవకాశం వచ్చింది. సినిమా చూసిన వాళ్లు అందరికీ నా రోల్ నచ్చుతుంది. ఇందులో ‘మేడమ్ సార్ మేడమ్’ సాంగ్‌లో అన్ని విధాలుగా చూపించారు. ఆ సాంగ్ అందరికి నచ్చుతుంది. ఇక అంకిత కొయ్య అమేజింగ్ కో యాక్టర్. వ్యక్తిగతంగా మనిషికి హెల్ప్ చేేస పర్సనాలిటీ. నటుడిగా ఎలా చేస్త్తాడో ‘ఆయ్’లోచూశాం. వండర్ ఫుల్ యాక్టర్. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు చాలా బావుంటాయి.
ముందే ఊహించా
మేడమ్ సార్ మేడమ్ సాంగ్‌కు మంచి స్పందన వస్తుందని ముందే ఊహించాను. లక్ష్మణ్ కార్య ట్యూన్ వినిపించారు. పాట వినిపించమంటే... విడుదల అయ్యే ముందు రోజు వరకు చూపించలేదు. ఆ పాట ట్యూన్ విన్నప్పుడు నచ్చింది. సిద్ శ్రీరామ్ పాడుతున్నారని తెలిశాక పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాను.
కంఫర్ట్ క్రియేట్ చేశారు...
రావు రమేష్, ఇంద్రజ వంటి సీనియర్లతో స్ర్కీన్ షేర్ చేసుకోవడం మొదట భయం వేసింది. నేను కంఫర్టబుల్‌గా ఉండేలా వాళ్ళు చూసుకున్నారు. ఓ రోజు సీన్ అయ్యాక రావు రమేష్ గారు ‘బాగా చేశావమ్మా’ అన్నారు. ఆ తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంద్రజ గారు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేదు. ఆవిడ చాలా ప్రెట్టిగా ఉంటారు. వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్.