Kavya thapar: 'విశ్వం'లో కావ్య పాత్ర ఎలా ఉండబోతోంది అంటే. 

ABN, Publish Date - Oct 06 , 2024 | 08:01 PM

"విశ్వం ఒక  యూనిక్ పాయింట్తో తెరకెక్కింది.  దర్శకుడు శ్రీను వైట్ల గారు తీసిన విధానం యూనిక్. లో నా పాత్ర చాలా కొత్తగా వుంటుంది. విశ్వంలో అన్నీ వైవిధ్యంగా వుంటాయి.

గోపీచంద్, కావ్యథాపర్ జంటగా డైనమిక్ దర్శకుడు  శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'విశ్వం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. వేణు దోనేపూడి, టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 11న థియేటర్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా  కావ్య థాపర్ విలేకరులతో మాట్లాడారు. 


"విశ్వం ఒక  యూనిక్ పాయింట్తో తెరకెక్కింది.  దర్శకుడు శ్రీను వైట్ల గారు తీసిన విధానం యూనిక్. లో నా పాత్ర చాలా కొత్తగా వుంటుంది. విశ్వంలో అన్నీ వైవిధ్యంగా వుంటాయి. మల్టీపుల్ లొకేషన్స్, నటీనటులు, దాదాపు 16 మంది కమేడియన్స్ ఇందులో వున్నారు. టీజర్ లో చూసినట్లు వెన్నెల కిశోర్, వీటి గణేష్ వంటివారు ఇందులో నటించారు. నా క్యారెక్టర్  భిన్నంగా డిజైన్ చేశారు. దర్శకడు శ్రీనువైట్ల గారు సన్నివేశపరంగా సీన్స్ చెప్పి నా చేత చేయించడం అనేది పెద్ద చాలెంజింగ్ అనిపించింది. ఆయన అన్ని విషయాల్లో ఫర్ ఫెక్ట్ గా వుంటారు. సిట్యువేషన్ పరంగా సన్నివేశాన్ని వివరించే విధానంలో కొత్తదనం చూపారు. నాది చాలా స్టైలిష్ కేరెక్టర్. నేను కాస్ట్యూమ్స్ డిజైనర్ గా ఇందులో చేశాను. మోడ్రన్ గా వుండే నేటి ట్రెండ్ కు తగిన అమ్మాయిని. కనుకనే కాస్ట్యూమ్స్ పరంగా చాలా కేర్ తీసుకోవాల్సి వచ్చింది. నాకున్న ఐడియాతోనూ, కాస్ట్యూమ్స్ డిజైనర్ ఐడియాకి తోడు శ్రీనువైట్ల గారి ఐడియాతో కాస్ట్యూమ్స్ ధరించాను. హిమాచల్, మనాలి వంటి చోట్ల మంచు ప్రాంతాల్లో వర్క్ చేయడం చాలా కష్టం. అంత కష్టమైన ప్రాంతాల్లో చాలా  ప్రికాషన్స్ తీసుకునేలా వారు సహకరించారు. 
నేను చాలా ఫాస్ట్ గా జోవియల్ గా వుంటాను. గోపీచంద్ గారు చాలా కామ్ గా ఉంటారు. సెట్లో చాలా సైలెంట్. తన పనేదో తాను చేసుకుంటారు. అందుకు భిన్నమైన కారెక్టర్ నాది. అందుకే ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా. మాడ్యులేషన్ పరంగా నైతే, సిస్టమాటిక్ విషయాన్ని గ్రహించాను. ఒకరకంగా తెలుగు కూడా నేర్చుకున్నా.

ఇక దర్శకుడి విషయానికొస్తే 
శ్రీనువైట్ల గారి డెడికేషన్ కు హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమాలో చాలా పాత్రలున్నాయి. అందరినీ మోటివేట్ చేయడమంటే మాటలు కాదు. ప్రతివారి నుంచి ఔట్ పుట్ రాబట్టుకోవాలి. ఒకరకంగా చెప్పాలంటే శ్రీనుగారి వల్లే నేను బాగా నటించగలిగాను. అంతా నాచురల్ గా వచ్చేలా చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ చాలా నేచురల్ గా వుంటుంది. అంతమంది కమేడియన్స్ ట్రెయిన్ లో వున్నా వారంతా సన్నివేశపరంగా వుంటారు. గతంలో ఆయన చేసిన సినిమాతో ట్రెయిన్ ఎపిసోడ్ పోల్చలేం. గతం కంటే విశ్వం చాలా కొత్తగా వుంటుందని చెప్పగలను. ప్రత్యేకత ఏమంటే అందరి పాత్రలను దర్శకుడు ఎలా యాక్ట్ చేయాలో చేసి చూపించారు. అలా నాకు కూడా నా పాత్రపరంగా చెబుతూ నా శైలిని మలుచుకునే చేశారు. నా పాత్ర కూడా కామెడీ చేస్తుంది.  



నటిగా అన్ని పాత్రలు చేయాలనుంది. ఇందులో గ్లామర్ పాత్ర దక్కింది. ఎటువంటి టఫ్ పాత్రనైనా చేస్తానే ధైర్యం కూడా వచ్చేసింది. సైకో కిల్లర్ తరహా పాత్రలు చేయడం టప్. కానీ అవి కూడా చేస్తాను. నటిగా పాత్రకు న్యాయం చేయాలి అనే నమ్ముతాను సక్సెస్, ఫెయిల్యూర్ అనేది నా చేతుల్లో లేదు. నా వరకు నేను పాత్రకు న్యాయం చేస్తాను. ఇచ్చిన పాత్రకు కష్టపడి పనిచేయడమే తెలుసు. మిగిలింది దేవుడిపై భారం వేస్తా. నేను చేసిన పాత్రను ప్రేక్షకులు ఆదరిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది. సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి ప్రతివారికీ ఉంటాయి.

ఔట్ డోర్ షూట్ లో చాలా చాలెంజింగ్ అనిపించింది. టెంపరేచర్ ఎక్కువగా వున్నప్పుడు, హిమాచల్ వంటి చోట్ల మైనస్ డిగ్రీలలో వాతావరణ వున్నప్పుడు యాక్ట్ చేయడం అనేది ఫిజికల్ చాలెంజ్. అవన్నీ చూసుకుని దేనికైనా రెడీ అన్నట్లుగా చేయగలిగాను. నాతోపాటు సాంకేతిక సిబ్బంది కెమెరాలు మోసుకుని రావడం, ఇతర సిబ్బంది కొండలు ఎక్కడం వంటివన్నీ చాలా చాలెంజింగ్ అంశాలే. కొత్త సినిమాలు లైన్ లో వున్నాయి. ఇప్పటికే మూడు సినిమాలకు సైన్ చేశాను. త్వరలో మీకు మరిన్ని విషయాలు తెలియజేస్తాను.

Updated Date - Oct 06 , 2024 | 08:01 PM