మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chiranjeevi: వరుణ్‌కు ప్రత్యేక శైలి ఉంది.. ఎప్పుడూ నన్ను ఫాలో కాలేదు!

ABN, Publish Date - Feb 26 , 2024 | 09:50 AM

"చరణ్‌, వరుణ్‌.. ఇలా వీరంతా నన్ను చూస్తూ వేరే రంగంలోకి వెళ్లలేకపోయారు. చదువు పూర్తయ్యాక యాక్టర్‌ అవ్వాలనుకున్నారు. ఈ విషయంలో నేను అందరినీ  ఎంకరేజ్‌ చేస్తా. ఎందుకంటే చిత్ర పరిశ్రమను నేను గౌరవిస్తాను. మనం ఎంతగా గౌరవిస్తే అంతగా మనల్ని అక్కున చేర్చుకుంటుందని బలంగా నమ్మాను. అలాంటి ఇండస్ట్రీలోకి నా బిడ్డలు వచ్చారంటే ఇంతకంటే కావాల్సిందేముంది’’ అని చిరంజీవి (Chiranjeevi) అన్నారు.

"చరణ్‌, వరుణ్‌.. ఇలా వీరంతా నన్ను చూస్తూ వేరే రంగంలోకి వెళ్లలేకపోయారు. చదువు పూర్తయ్యాక యాక్టర్‌ అవ్వాలనుకున్నారు. ఈ విషయంలో నేను అందరినీ  ఎంకరేజ్‌ చేస్తా. ఎందుకంటే చిత్ర పరిశ్రమను నేను గౌరవిస్తాను. మనం ఎంతగా గౌరవిస్తే అంతగా మనల్ని అక్కున చేర్చుకుంటుందని బలంగా నమ్మాను. అలాంటి ఇండస్ట్రీలోకి నా బిడ్డలు వచ్చారంటే ఇంతకంటే కావాల్సిందేముంది’’ అని చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇండియన్  ఎయిర్‌ ఫోర్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine) వరుణ్‌తేజ్‌(Varun tej) మానుషి చిల్లార్‌ జంటగా నటించారు.  శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకుడు. మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ "నేను అమెరికాలో ఉండగా వరుణ్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది. హైదరాబాద్‌ వచ్చాక ఈ ఈవెంట్‌ గురించి చెప్పాడు. రియల్‌ హీరోల గురించి నువ్వు మాట్లాడితే రీచ్  బావుంటుంది అన్నాడు. మనల్ని రక్షించే వారియర్స్‌ గురించి చెప్పడం నాకు దక్కిన గొప్ప అవకాశం. ఈ వేడుకకు రావడం గర్వంగా ఉంది. తెలుగులో మంచి రెమ్యునరేషన్  ఉంటుందనీ, కమర్షియల్‌ డైరెక్టర్‌గా స్థిరపడిపోవచ్చనే ఉద్దేశంతో శక్తి ప్రతాప్‌ ఇక్కడకు రాలేదు. తన సొంత ఖర్చుతో సర్జికల్‌ స్ట్రయిక్ షార్ట్‌ ఫిల్మ్‌ తీశాడు. ఇండియన్‌ ఎయిర్స్‌ ఫోర్స్‌ అది చూసి ఆశ్చర్యపోయింది. ఈసారి ఈ తరహా సినిమా తీస్తే  మరింత సమాచారం ఇస్తామని సంబంధిత అధికారులు దర్శకుణ్ణి ప్రోత్సహించారు. ఇలాంటి సినిమాలు బాగా ఆడాలి. ముఖ్యంగా యువత చూడాలి. ఈ చిత్రాన్ని 75 రోజుల్లో చిత్రీకరించారు. తక్కువ బడ్జెట్‌లో విజువల్‌ వండర్‌గా తీయడం ఆషామాషీ కాదు. ఆ విషయంలో సినిమా విడుదలకు ముందే దర్శకుడు సక్సెస్‌ అయ్యారు. దీన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి’’ అని అన్నారు.


ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘నవదీప్‌ మా ఇంట్లో మనిషిలాంటివాడు. ‘ధ్రువ’ సినిమాలో తన నటన నాకు ఇష్టం. ఇందులోనూ మంచి క్యారెక్టర్‌ చేశాడు. అభినవ్‌  ప్రతిభ గల నటుడు.  సోషల్‌ మీడియా మీమ్స్‌లో ఎక్కువగా కనిపిస్తుంటాడు. ఇక వరుణ విషయానికొస్తే నటుడిగా వాడు నన్ను ఎప్పుడూ ఫాలో కాలేదు. ముందు నుంచీ విభిన్న కథలు ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు. మా కుటుంబ హీరోల్లో ఎవరికీ రాని ఇలాంటి అవకాశాలు వరుణ్‌కు వచ్చాయి. ఎయిర్‌ ఫోర్స్‌పై టాలీవుడ్‌లో తెరకెక్కిన తొలి చిత్రమిదే. గతేడాది హాలీవుడ్‌ సినిమా ‘టాప్‌గన్‌’లోని విజువల్స్‌ చూసి ఇలాంటి సినిమా మనం తీయగలమా? అనుకున్నా. ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ అదే స్థాయిలో ఉంది. టాలెంట్‌ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు’’ అని పేర్కొన్నారు.



వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ "కష్టాన్ని నమ్ముకుని పైకి రావాలని ఎప్పుడూ చెబుతుంటారాయన. ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకున్న ఆయనకు థ్యాంక్స్‌ చెబుతున్నా. మా పెదన్నానే నాకు స్ఫూర్తి. ఈ తరహా సినిమా చేయడం నాకు గర్వంగా ఉంది’’ అని అన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 09:50 AM