మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chiranjeevi: ఆ ఒక్క విషయాన్ని నా దగ్గర దాచాడు!

ABN, Publish Date - Feb 26 , 2024 | 12:58 PM

మెగాస్టార్‌ చిరంజీవి వరుణ్‌తేజ్‌పై కోపంగా ఉన్నారు. అన్ని విషయాలు తనతో షేర్‌ చేసుకునే వరుణ్‌.. ప్రేమ విషయాన్ని మాత్రం తనతో చెప్పలేదని, అందుకు ఇప్పటికీ తనపై కోపంగా ఉందని చిరంజీవి అన్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) వరుణ్‌తేజ్‌పై కోపంగా ఉన్నారు. అన్ని విషయాలు తనతో షేర్‌ చేసుకునే వరుణ్‌(varun tej).. ప్రేమ విషయాన్ని మాత్రం తనతో చెప్పలేదని, అందుకు ఇప్పటికీ తనపై కోపంగా ఉందని చిరంజీవి అన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన 'ఆపరేషన్  వాలంటైన్' చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో ఆయన మాట్లాడారు. (Operation Valentine)

"వరుణ్‌ తేజ్‌ ప్రతీ విషయాన్ని నాతో చెప్తాడు. వాళ్ల నాన్నకు చెప్పుకోలేని విషయాలు కూడా నాతో చెప్పుకుంటాడు. కానీ వాడి ప్రేమ వ్యవహారం ఒక్కటే చెప్పలేదు. చాలాసార్లు నన్ను ఇన్‌స్పిరేషన్‌ అని చెప్తుంటాడు. మరి లీక్స్‌ విషయంలో కూడా ఇన్‌స్పైర్‌ అయి నాకు చెప్పొచ్చు కదా! ఈ ఒక్కటి మాత్రం చెప్పలేదు. ఈ విషయంలో నాకు ఇప్పటికీ కోపంగా ఉంది’ అని సరదాగా అన్నారు. అయితే దీనికి తేజ్‌ సమాధానమిస్తూ ‘‘గౌరవంతో కూడిన భయం వల్లే చెప్పలేదు. కానీ ఇంట్లో  చెప్పే ముందు మా పెదనాన్నకే చెప్పాను’ అని క్లారిటీ ఇచ్చారు.



ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ హీరోగా శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. మానుషి చిల్లర్‌, రుహానీ శర్మ, నవదీప్‌ ముఖ్య  పాత్రలు పోషించారు. మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. 

Updated Date - Feb 26 , 2024 | 10:16 PM