Chiranjeevi: నటుడిగా తొలి అడుగు వేసింది 1974 కాదు.. 1970లోనే ..
ABN, Publish Date - Oct 27 , 2024 | 03:04 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటుడిగా తొలి అడుగువేసింది 1974లో కాదు.. 1970వ సంవత్సనంలో. 'పరధ్యానం పరంధామయ్య’ అనే నాటికతో ఆయన స్టేజ్ ఆర్టిస్ట్‌గా పరిచయమయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటుడిగా తొలి అడుగువేసింది 1974లో కాదు.. 1970వ సంవత్సనంలో. 'పరధ్యానం పరంధామయ్య’ అనే నాటికతో ఆయన స్టేజ్ ఆర్టిస్ట్‌గా పరిచయమయ్యారు. అది కూడా కాలేజీలో చదువుతుండగా కాదు.. స్కూల్ డేస్‌లోనే. అసలు ఆయన నటుడిగా పరిచయమైంది ఎక్కడ, ఎప్పుడు, ఎలా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కథనం చదవాల్సిందే.
కొణిదెల శివశంకర్ వర ప్రసాద్ (Konidela siva Shankara vara Prasad) మొదటిసారి ఓ నాటికలో కనిపించారు. శ్రీ పెన్మెత్స రంగరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన 7, 10 తరగతులు చదివారు. 1970లో పదవ తరగతి చదువుతుండగా ఫస్ట్ స్టేజీ పెర్ఫారెన్స్ ఇచ్చారు. మెగాస్టార్ నట జీవితంలో తొలి అడుగు వేసిన ఆ నాటిక పేరు 'పరధ్యానం పరంధామయ్య’ (Paradyanam parandamayya). తొలి నాటికతోనే ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. ఈ నాటికకు కత్తుల పండరీనాధ సత్యప్రసాద్ రచన, దర్శకత్వం చేయగా, దశిక సుబ్రహ్మణ్యం దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అందులో పరంధామయ్యగా చిరంజీవి ముఖ్య పాత్ర పోషించారు.
స్కూల్ డేస్‌లో ఆయన వేసిన తొలి నాటకమిదే. చిరంజీవి ఏ స్టేజ్‌పైన అయితే ఈ నాటకం వేశారో ఆ వేదిక ఇప్పటికీ మొగల్తూరులో అలాగే ఉంది. దానికి చిరంజీవి కళా వేదిక అనే పేరు కూడా ఉంది. ఆ పేరుతో శిలా ఫలకం కూడా ఉంది. ఇప్పుడు ఆ వేదికకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే ఆయన తొలిసారి నటుడిగా కనిపించింది 'రాజీనామా' అనే నాటకంతో అని, అది బీకాం డిగ్రీ చదువుతున్నప్పుడని వార్తలొచ్చాయి. ఆ నాటకం కాలేజ్‌లో వేసిన మొదటి నాటకం కావచ్చు. కానీ స్కూల్‌డేస్‌లో 1970లో తొలిసారి ఆయన 'పరధ్యానం పరంధామయ్య’ నాటికతో నటుడిగా పరిచయమయ్యారు.