Chiranjeevi: కొండా సురేఖ వ్యాఖ్యలు.. చిరంజీవి ఫైర్
ABN, Publish Date - Oct 03 , 2024 | 09:42 AM
తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda msurekha) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda msurekha) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను (Ktr) విమర్శిచే క్రమంలో తెలుగు చిత్రను ఉద్దేశించి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీని, నటీనటులను రాజకీయాల్లోకి లాక్కొచ్చారు. వ్యక్తిగత విషయమైన సమంత, నాగచైతన్య విడాకులు గురించి అక్కినేని కుటుంబం (Akkineni family) గురించి ఆమె బహిరంగంగా మాట్లాడటంతో ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో కొండా సురేఖ వ్యాఖ్యలను ఇప్పటికే అక్కినేని కుటుంబం, సమంత ఖండించారు. తాజాగా మంత్రి వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమలోని నటీనటులు స్పందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
"గౌరవనీయమైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను. సెలబ్రిటీలు. త్వరితగతిన వార్తల్లో వైరల్ అయ్యేందుకు సెలబ్రిటీలు, సినీ పరిశ్రమ సభ్యులను సాప్ట్ టార్గెట్‌గా చేసి మాట్లాడటం సిగ్గు చేటు. మా సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటలతో దాడులు చేయడం చిత్ర పరిశ్రమ నుంచి ఏకతాటిపై వ్యతిరేకిస్తున్నాం. సంబంధం లేని వ్యక్తులను, అందులోనూ మహిళలను రాజకీయంలోకి లాగడం, అసహ్యకరమైన కల్పిత ఆరోపణలు చేయడం దిగజారుడుతనం అవుతుంది. సమాజాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు నాయకులను ఎన్నుకుంటాం. కానీ మీ ప్రసంగాలతో సమాజాన్ని కలుషితం చేయకూడదు. రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానంలో ఉన్నవారు సమాజానికి మంచి ఉదాహరణంగా ఉండాలి. సదరు మంత్రి తన వ్యాఖ్యలను త్వరితగతిన ఉపసంహరించుకోవాలి’’ అని చిరంజీవి అన్నారు.