Chaitu Sobhita Marriage: చైతూ-శోభితల పెళ్లికి వస్తున్న అతిథులు వీరేనా..
ABN, Publish Date - Dec 04 , 2024 | 10:32 AM
అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాలల పెళ్లికి అంతా సిద్ధమైంది. అంగరంగ వైభవంగా ఈ పెళ్లిని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిపించేందుకు కింగ్ నాగ్ అన్ని ఏర్పాట్లను చేశారు. అయితే ఈ పెళ్లికి వచ్చే గెస్ట్‌లు ఎవరనేది ఆసక్తికరంగా మారిన వేళ.. కొందరు గెస్ట్‌ల పేర్లు ఆల్రెడీ రివీలయ్యాయి. వారు ఎవరంటే..
అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాలల పెళ్లి నేడు (బుధవారం) అంగరంగవైభవంగా జరగబోతోన్న విషయం తెలిసిందే. ఈ పెళ్లికి ఐకానిక్ అన్నపూర్ణ స్టూడియోస్ వేదిక కానుంది. అక్కినేని ఇంట చైతూ పెళ్లి, అఖిల్ నిశ్చితార్థం వార్తలతో కొన్ని రోజులుగా అక్కినేని ఫ్యామిలీ వార్తలలో నిలుస్తూనే ఉంది. ముందుగా చైతూ-శోభితల పెళ్లి వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు రెండు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. అయితే ఈ పెళ్లిని ఆడంబరంగా కాకుండా.. చాలా సింపుల్‌గా లిమిటెడ్ గెస్ట్స్, ఇరు ఫ్యామిలీలకు చెందిన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మాత్రమే నిర్వహించాలే ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో అసలీ పెళ్లికి వచ్చే గెస్ట్‌లు ఎవరనేది హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు, సోషల్ మీడియా వేదికగా కొందరు గెస్ట్‌ల పేర్లు కూడా రివీలవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే.. (Chaitanya Sobhita Wedding)
Also Read-Megastar Chiranjeevi: వింటేజ్ మెగాస్టార్.. బాసూ, ఆ సీక్రెట్ ఏంటో చెప్పొచ్చుగా
అక్కినేని ఫ్యామిలీకి సన్నిహితుడు, అక్కినేని నాగార్జున మిత్రుడు అయిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో సహా ఈ పెళ్లి హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. భార్య సురేఖతో పాటు కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసనలతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు హాజరు కానున్నారని సమాచారం. చిరంజీవి ఫ్యామిలీతో పాటు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఈ వేడుకకు హాజరుకానున్నట్లుగా తెలుస్తోంది. నాగార్జునను ఎన్టీఆర్ ఎంతో ఆప్యాయంగా బాబాయ్ అని పిలుస్తుంటారనే విషయం తెలిసిందే. ఇంకా దర్శకధీరుడు రాజమౌళితో కలిసి రెబల్ స్టార్ ప్రభాస్ ఈ వేడుకకు రానున్నారని తెలుస్తోంది.
అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు- నమ్రతా శిరోద్కర్ దంపతులు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి ఈ పెళ్లికి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, బ్యాడ్మింటర్ ప్లేయర్ పీవీ సింధులతో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి నయన్- విఘ్నేష్ దంపతులు కూడా ఈ వివాహ వేడుకకు హాజరు కానున్నారని సమాచారం. వీరితో పాటు మరికొందరు ప్రముఖులు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల నాగార్జున మాట్లాడుతూ.. సెలబ్రిటీ గెస్ట్‌లు వెయ్యి మంది ఈ పెళ్లికి హాజరవుతారని ప్రకటించిన విషయం తెలిసిందే.