Nagabandham: పెద‌కాపు క‌ర్ణ హీరోగా.. పాన్ ఇండియా 'నాగబంధం'! క్లాప్ కొట్టిన చిరంజీవి

ABN, Publish Date - Oct 14 , 2024 | 02:48 PM

పెద‌కాపు ఫేం క‌ర్ణ హీరోగా.. పాన్ ఇండియా 'నాగబంధం' సినిమా సోమ‌వారం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మ‌వ‌గా మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు.

Nagabandham

పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు నిర్మించే పాషనేట్ ఫిల్మ్ మేకర్ అభిషేక్ నామా (Abhishek Nama) డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌తో దర్శకుడిగా సక్సెస్ ఫుల్ డెబ్యు చేసిన తర్వాత, తన అప్ కమింగ్ డైరెక్షనల్ వెంచర్ 'నాగబంధం- ది సీక్రెట్ ట్రెజర్ (Nagabandham) ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. అభిషేక్ నామా కథ, స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి NIK స్టూడియోస్ ప్రొడక్షన్ నంబర్ 1 గా కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. తారక్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పిస్తున్నారు.

'పెదకాపు' సినిమాలో తన పవర్ ప్యాక్డ్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో అందరి ప్రశంసలు అందుకున్న విరాట్ కర్ణ (Virat Karrna) ఈ మూవీలో లీడ్ రోల్ పోషిస్తుండ‌గానభా నటేష్ (Nabha Natesh), ఐశ్వర్య మీనన్ (IshwaryaMenon) ఫిమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఈరోజు టీం, ప్రత్యేక అతిథుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముహూర్తం షాట్‌కి క్లాప్‌ కొట్టారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచాన్ చేయగా, తొలి షాట్‌కి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఆసియన్‌ సునీల్‌ స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు.

అభిషేక్ నామా డివైన్, అడ్వంచర్ ఎలిమెంట్స్ తో కూడిన పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ రాశారు. తిరువనంతపురం లోని పద్మనాభస్వామి ఆలయంలో నిధి, పూరీ జగన్నాథ ఆలయంలో రత్న భండార్‌ను తెరిచిన తర్వాత గుప్త నిధుల అంశం దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్ర‌స్తుతం భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాలు నాగబంధం ద్వారా రక్షించబడుతున్నాయి. ఆ 108 విష్ణు దేవాలయాలకు సంబంధించిన నాగబంధం చుట్టూ అ ఈ సినిమా కథ ఉండ‌నుంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఇంట్రో వీడియో ప్రేక్షకులను కట్టిపడేయ‌గా KGFలో తన పాత్రతో పేరు తెచ్చుకున్న అవినాష్ అఘోరాగా కనిపించారు. ఈ చిత్రంలో VFX, ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ స్టాండర్డ్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి. ఈ చిత్రానికి సౌందర్ రాజన్ డీవోపీగా పని చేస్తుండ‌గా, అభే సంగీతం అందిస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ రాయగా, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్. అశోక్ కుమార్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు


ఈ ప్రతిష్టాత్మకమైన హై-బడ్జెట్ ప్రాజెక్ట్ మేజిక్, మిస్టరీ, అడ్వెంచర్ జర్నీని ప్రామిస్ చేస్తోంది. పాన్ ఇండియా మూవీ నాగబంధం 2025లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ నెల 23న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామని మేకర్స్‌ అనౌన్స్ చేశారు. నిర్మాత కిషోర్ అన్నపురెడ్డి మాట్లాడుతూ..చిరంజీవి గారు ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రావడం మాకు చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అక్టోబర్లోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మరో ఏడాదిన్నరలోనే సినిమాని ప్రేక్షకులను తీసుకొస్తున్నాము. ఎగ్జాక్ట్ డేట్ త్వరలోనే చెప్తాము. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తామ‌న్నారు.

హీరో విరాట్ కర్ణ మాట్లాడుతూ.. చిరంజీవి గారు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీలౌతున్నాను. సినిమా చాలా మంచిగా వస్తుందని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్ యూ' అన్నారు హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh)మాట్లాడుతూ.. నాగబంధం ఇంట్రో వీడియో రిలీజ్ చేసినప్పుడే ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికీ అర్థమై ఉంటుంది. అభిషేక్ గారు ఈ సినిమాని చాలా అద్భుతంగా రూపొందిస్తున్నారు. విరాట్ తో ఫస్ట్ టైం వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అభిషేక్ గారికి థాంక్యూ. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం' అన్నారు.

Updated Date - Oct 14 , 2024 | 02:48 PM