మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Happy Mothers Day: అమ్మది స్వార్థం లేని ప్రేమ...

ABN, Publish Date - May 12 , 2024 | 01:33 PM

బిడ్డ ఏ స్థాయిలో ఉన్నా తల్లికి కొంగు చాటు బిడ్డే.. అమ్మ ఒడిలో ఆడుకుంటూ చేసే అల్లరి మరువలేనిది.. ఆ అల్లరికి వీపు మీద అమ్మ వేసిన దోసెలు ఎప్పటికీ మధురమే!

బిడ్డ ఏ స్థాయిలో ఉన్నా తల్లికి కొంగు చాటు బిడ్డే..
అమ్మ ఒడిలో ఆడుకుంటూ చేసే అల్లరి మరువలేనిది..
ఆ అల్లరికి వీపు మీద అమ్మ వేసిన దోసెలు  ఎప్పటికీ మధురమే!
ఈ సృష్టిలో ఏ స్వార్థం లేకుండా మనపై ప్రేమ చూపించేది అమ్మ మాత్రమే.
నేడు మాతృదినోత్సవం సందర్భంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ తమ మాతృమూర్తులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (Happy mothers day)



మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తన తల్లి అంజనా దేవితో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేసి జన్మనిచ్చి, పెంచి పోషించిన అమ్మకి ఈ ఒక్కరోజు ఏంటి.. ప్రతిరోజు అమ్మదే.. ఈ జీవితమే అమ్మది. హ్యాపీ మథర్స్‌ డే అంటూ మెగాస్టార్ చిరంజీవి  ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఆయనతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా తమ మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు.



"నన్ను కన్న తల్లి మా అమ్మ ఒక తల్లి
నన్ను భర్తగా స్వీకరించిన భార్య ఒకతల్లి
నేను జన్మనిచ్చిన నా కుమార్తె ఒక తల్లి
నా కోడలు ఒక తల్లి
ఇంతమంది తల్లుల చుట్టూ ఉండగా ఇంకా నాకు ఏం కావాలి’’
హ్యాపీ మధర్స్‌ డే- మంచు మోహన్ బాబు (Mohan babu)


Updated Date - May 12 , 2024 | 03:42 PM