Allu Arjun Arrest: బన్నీ మొదటి సినిమా రచయిత షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Dec 14 , 2024 | 08:47 AM

అల్లు అర్జున్ మొదటి సినిమా రచయిత చిన్ని కృష్ణ.. ఆయన అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంద్ర సినిమా టైమ్‌లోనూ చనిపోయారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ చిన్ని కృష్ణ ఏమన్నారంటే..

Chinni Krishna

అల్లు అర్జున్‌ని అరెస్ట్‌ చేయడం సరికాదంటూ మొదట బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ స్పందించగా.. ఆ తర్వాత టాలీవుడ్ సెలబ్రిటీలు వరస ట్వీట్స్ చేశారు. కొందరు అల్లు అర్జున్ ఇంటికి చేరి ఫ్యామిలీకి ధైర్యం చెప్పారు. నాని, రష్మికా మందన్నా, అనిల్ రావిపూడి, అడవి శేష్, రవి కిషన్, రామ్ గోపాల్ వర్మ వంటి వారంతా ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. తాజాగా రైటర్, అల్లు అర్జున్ మొదటి సినిమా రచయిత అయిన చిన్ని కృష్ణ ఈ అరెస్ట్‌పై స్పందించారు.

అల్లు అర్జున్ అరెస్ట్‌పై రైటర్ చిన్నికృష్ణ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి సభల్లో ప్రజలు చనిపోతారు. అంతెందుకు ‘ఇంద్ర’ సినిమా సమయంలో కూడా చనిపోయారు. అన్యాయంగా అక్రమంగా వాంటెడ్‌గా చేసిన ఈ దుర్మార్గాన్ని ఎవరు సహించే పరిస్థితి లేదు. ప్రపంచంలో ఇంత నీచమైన నికృష్టమైన అరెస్ట్ ఈ భూమి మీద చూడం. యావత్ భారతదేశం దుఃఖంలో ఉంది.. దాని రియాక్షన్ త్వరలో చూస్తారు. ఇదంతా కావాలని ఒక వ్యక్తి చేసినా.. రాష్ట్రం మొత్తం మూల్యం చెల్లించక తప్పదు. అన్ని సినిమాలకు ఇచ్చినట్టే ‘పుష్ప2’ సినిమాకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది‌‌.. ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు. ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి‌.‌ బాధిత కుటుంబానికి తాము వంద శాతం అండగా నిలబడతామని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. కానీ, చట్టపరంగా పెట్టిన సెక్షన్స్ అన్నీ తప్పు. ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి.. అయితే అల్లు అర్జున్‌పై చట్టపరంగా పెట్టిన ప్రతి సెక్షన్ తప్పు’’ అని చిన్ని కృష్ణ తెలిపారు.


న్యాచురల్ స్టార్ నాని కూడా అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీరియస్‌గా స్పందించారు. ‘‘సినిమా వాళ్లకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు, మీడియా చూపించే అత్యుత్సాహం సాధారణ పౌరుల రక్షణలో కూడా చూపించాలని కోరుకుంటున్నా. మనం మంచి సమాజంలో జీవించాలి. ఇదొక దురదృష్టకర ఘటన. దీని నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. ఇకపై మరిన్ని జాగ్రత్తలు పాటించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మనందరి తప్పు ఉంది. ఒక వ్యక్తిని నిందించడం కరెక్ట్‌ కాదు’’ అని నాని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - Dec 14 , 2024 | 08:47 AM