Chilkur Rangarajan: సినిమా చూసి నాకు మాటలు రాలేదు
ABN, Publish Date - Jan 27 , 2024 | 08:04 PM
తేజ సజ్జా (Teja sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prashanth varma)దర్శకత్వం వహించిన ‘హను-మాన్’ (Manu-man)చిత్రం సక్సెస్‌లో భాగంగా చిత్ర యూనిట్ థ్యాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ (Chilkur Rangarajan) పాల్గొని చిత్రం గురించి మాట్లాడారు.
తేజ సజ్జా (Teja sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prashanth varma)దర్శకత్వం వహించిన ‘హను-మాన్’ (Manu-man)చిత్రం సక్సెస్‌లో భాగంగా చిత్ర యూనిట్ థ్యాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ (Chilkur Rangarajan) పాల్గొని చిత్రం గురించి మాట్లాడారు. ఈ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు.
‘‘తన నామాన్ని నిత్యం జపిస్తే బుద్థి, బలం, ధైర్యం నిర్భయత్వాన్ని శ్రీరామదూత ఆంజనేయస్వామి ప్రసాదిస్తారు. ప్రేక్షకులంతా ఆయన్ని తలచుకునేలా చేసిన హనుమాన బృందానికి నా కృతజ్ఞతలు. అర్చకులనేవారు రెండు రకాల పాత్రలు పోషిస్తారు. భక్తులకు ప్రతినిధిగా గర్భగుడిలోకి వెళ్తారు. బయటకు వచ్చేటప్పుడు స్వామివారి ప్రతినిధిగా వస్తారు. యంగ్ టీమ్ అద్భుతాన్ని సృష్టించింది. సినిమా చూసి నాకు మాటలు రాలేదు. కథ విషయంలో ప్రశాంత్ సోదరి చక్కగా రీసెర్చ్ చేశారు. ప్రస్తుత రోజుల్లో సినిమా కీలక మాధ్యమం. సమాజానికి విలువైన చిత్రాలను అందించాలి. ‘హను-మాన్’లో ఎక్కడా అసభ్యత కనిపించలేదు. ఆడవాళ్లను వక్రీకరించి చూపిస్తేనే హిట్ అవుతుందనే ఆలోచనలో ఉన్నవాళ్లకు ఇదొక చెంపదెబ్బ’’ అని అన్నారు.
‘‘చిన్నప్పటి నుంచి నేను చేసిన ప్రతి పనిని నా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. వారికి కృతజ్ఞతలు. నిర్మాత నిరంజన్ రెడ్డి మాకు అండగా నిలిచారు. ఇలాంటి నిర్మాత దొరకడం అదృష్టం. ఎనిమిదేళ్ల క్రితమే తేజతో ఒక సినిమా చేయాలని ప్లాన చేశా. ఆర్థికపరమైన కారణాలతో అది పట్టాలెక్కలేదు. అప్పటినుంచి మేమిద్దరం కలిసి ట్రావెల్ చేస్తున్నాం. ‘జాంబీరెడ్డి’తో మా కాంబో సెట్ అయ్యింది. అతడు మంచి నటుడు. ఎమోషనల్ సీన్స్‌లో జీవిస్తాడు. ఫ్రెండ్‌ని హీరో చేయడం సంతృప్తినిస్తుంది. స్టార్‌ని చేయడం అంతకుమించిన ఆనందాన్ని ఇస్తుంది. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చూసి ‘హను-మాన్’లో రోల్‌కు అమృతను ఫిక్స్ చేశా. మూడేళ్ల క్రితం రవితేజ నాకు మాటిచ్చారు. ఆ మాటను దృష్టిలో ఉంచుకునే ఇటీవల ‘హను-మాన్’లో కోటి పాత్రకు వాయిస్ ఓవర్ అడిగా. మా యూనివర్స్‌లో కోటి పాత్రను మరింత ముందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నా. రవితేజ అంగీకరిస్తే ఆయనతో ఒక సినిమా చేయాలనుకుంటున్నా’’ అని ప్రశాంత్ అన్నారు.