Chaitu Sobhita Wedding: చైతన్య పెళ్ళికి గెస్ట్స్ ఎవరంటే.. మరికొన్ని గంటల్లో పెళ్లి
ABN, Publish Date - Dec 03 , 2024 | 06:09 PM
అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్లల పెళ్లి మరికొన్ని గంటల్లో గ్రాండ్ గా జరగనుంది. ఈ వేడుకకి ఎవరెవరు హాజరు కానున్నారు అంటే..
అక్కినేని హీరో నాగచైతన్య, థండరింగ్ బ్యూటీ శోభితల విహహం మరికొన్ని గంటల్లో అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా జరగనుంది. ఈ వేడుకకి ఫ్యామిలీతో పాటు సన్నిహితులు, సినీ రాజకీయ ప్రముఖులని 300 మందిని ఆహ్వానించారు. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబంతో పాటు ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌళి హాజరు కానున్నారు.
ఇటీవల నాగార్జున టయోటా లెక్సస్ వాహనాన్ని కొన్నారు. నాగ చైతన్య పెళ్లి కోసమే సుమారు 2 కోట్లు పెట్టి ఈ కారు కొన్నారని, అయితే దీనిని శోభితకు బహుమతిగా ఇవ్వడం కోసమే తీసుకున్నారని టాక్ నడుస్తోంది. దీనితోపాటు విలువైన బంగారు ఆభరణాలను కూడా శోభితకు అక్కినేని ఫ్యామిలీ కానుకలు ఇవ్వనుందట. ఇటీవల హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయానికి నాగార్జున కొత్త కారుతో వచ్చారు. కారు రిజిస్టర్ చేసుకున్న అనంతరం అభిమాపులతో ఫొటోలు దిగారు. నాగార్జున కొనుగోలు చేసిన కొత్త కారు ధర దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు అని టాక్. సెలబ్రిటీలకు ఇష్టమైన కార్ ఇది. రణబీర్ కపూర్ కూడా ఇంతకు ముందు ఈ కారును కొన్నాడు. ఇప్పుడు ఇదే కారును శోభితకు కానుకగా నాగ్ ఇవ్వనున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త్త వైరల్ అవుతుంది.
మరోవైపు కాబోయే అల్లుడు నాగచైతన్యకు శోభిత తల్లిదండ్రులు భారీగానే కానుకలు ఇవ్వనున్నారని కూడా టాక్ డుస్తోంది. నాగచైతన్యకు ఒక ఆడీ కారుతో పాటు స్పోర్ట్స్ బైక్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేకాకుండా హైదరాబాద్‌లోనే ఓ లగ్జరీ విల్లాను కూడా ఇవ్వనున్నారట. అయితే అక్కినేని కుటుంబం.. తమకు ఎలాంటి డబ్బు, నగలు అవసరం లేదని, తమ కొడుకుకి భార్యగా, చక్కటి ఇల్లాలుగా, జీవితాంతం తోడునీడుగా ఉంటే చాలని శోభిత కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సన్నిహితుల నుంచి సమాచారం.