Chaitu Sobhita Wedding: ఒక్కటైనా చైతూ-శోభిత.. స్పెషల్ ఫోటోలు
ABN, Publish Date - Dec 04 , 2024 | 09:01 PM
కొన్ని గంటల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ లో హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీకోసం కొన్ని ఫోటోలు.
అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ఒక్కటయ్యారు. ఈరోజు రాత్రి 8.15 నిమిషాలకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకకి అక్కినేని, ధూళిపాళ కుటుంబ సభ్యులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, టీ సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరినాథ్, రానా దగ్గుబాటి,సుహాసిని, అడవి శేష్, కళ్యాణ్ కృష్ణ, అల్లు అరవింద్ దంపతులు, కీరవాణి, దర్శకుడు శశికిరణ్ తిక్క, అశోక్ గల్లా, దర్శకుడు చందు మొండేటి తదితరులు పెళ్ళికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.