Kishan Reddy: తనకు ప్రాణహాని ఉందని తెలిసి కూడా..

ABN, Publish Date - Nov 12 , 2024 | 04:18 PM

గతంలో నేను, జితేందర్ రెడ్డి కలిసి భారతీయ జనతా పార్టీ యువ మోర్చాలో పనిచేసాము. ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మరియు అఖిల భారత విద్యా పరిషత్ కార్యకర్తగా వ్యవహరించారని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తాజాగా ఆయన ‘జితేందర్ రెడ్డి’ సినిమాను చూశారు. అనంతరం జితేందర్ రెడ్డి గురించి, అలాగే సినిమా గురించి మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే..

Jitender Reddy Movie Event

రాకేష్ వర్రే టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’ (Jitender Reddy). ‘ఉయ్యాలా జంపాల, మజ్ను’ సినిమాల దర్శకుడు విరించి వర్మ దర్శకత్వంలో 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ముదుగంటి క్రియేషన్స్‌పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 8న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. తాజాగా ఈ సినిమాని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Central Minister Kishan Reddy) చూసి ‘జితేందర్ రెడ్డి’తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Also Read-Krish weds Priti: సైలెంట్‌గా రెండో పెళ్లి చేసుకున్న క్రిష్.. పెళ్లి ఫొటోలు వైరల్

ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గతంలో నేను, జితేందర్ రెడ్డి కలిసి భారతీయ జనతా పార్టీ యువ మోర్చాలో పనిచేసాము. ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మరియు అఖిల భారత విద్యా పరిషత్ కార్యకర్తగా వ్యవహరించారు. ఆయన అప్పట్లోనే పేద ప్రజలను, బడుగు బలహీన వర్గాల ప్రజలను సంఘటితం చేసి వాళ్ల కష్టాలను తెలుసుకొని, వాళ్ల కోసం నిలబడిన వ్యక్తి. జాతీయ భావజాలంతో, వీరోచిత పోరాట పటిమతో చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప వ్యక్తి జితేందర్ రెడ్డి. వరంగల్‌లో అప్పట్లో జరిగిన అటల్ బిహారీ వాజ్‌పేయి గారి సభకు తనవంతుగా జగిత్యాల ప్రాంతం నుంచి 50 బస్సుల ద్వారా పేద ప్రజలను, యువకులను సంఘటితం చేసి ఆ మీటింగ్‌ని విజయవంతం చేసిన వ్యక్తి జితేందర్ రెడ్డి. తనకు ప్రాణహాని ఉందని తెలిసి కూడా వెనుతిరగకుండా ప్రజల కోసం ప్రజలతో ఉంటూ పోరాటం చేసిన వ్యక్తి.


72 బుల్లెట్లు ఆయన శరీరంలోకి దింపి నక్సలైట్లు అయినను ఏవిధంగా హత్య చేశారు అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. హింస ద్వారా ఏది సాధించలేము అని చెప్పడమే ఆయన ప్రయత్నం. ఇప్పటికీ ఎంతోమంది తుపాకుల ద్వారా హింసకు పూనుకుంటూ అనుకున్నది సాధించవచ్చు అనుకోవడం తప్పు. ఆ ఆలోచనను మార్చుకోవాలి అనే విధంగా ఉందీ సినిమా. జితేందర్ రెడ్డి తండ్రిగారైన ముదిగంటి మల్లారెడ్డి సాత్విక స్వభావులు. తన కుమారుడు పోరాటంలో చనిపోతాడు అని తెలిసి కూడా ఆయన ఎక్కడా అడ్డుకోకుండా ప్రజల కోసం నిలబెట్టిన వ్యక్తి. ఈ రోజున రవీందర్ రెడ్డిగారు తన సోదరుడైన జితేందర్ రెడ్డి యొక్క చరిత్రను ప్రజలకు తెలియజేయాలి అనుకొని ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా మంచి విషయం. ముఖ్యంగా రాకేష్ వర్రే జితేందర్ రెడ్డి పాత్రలో ఒదిగిపోయి చాలా చక్కగా నటించారు. అదేవిధంగా ఈ చిత్రాన్ని ఇంత చక్కగా దర్శకత్వం వహించినటువంటి విరించి వర్మకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్‌గారి రాజ్యాంగం ద్వారా బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పది అని చెప్పడం జరిగింది. కావున నక్సలైట్లు నక్సలిజం వదిలిపెట్టి ప్రజాస్వామ్యం వైపు రావాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు.

Also Read-Tollywood Stars: అందరు స్టార్స్ మాల్దీవుల్లోనే.. ఎం జరుగుతుందంటే

Also Read-Allu Arjun Fans: ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్‌పై ఫ్యాన్స్ దాడి.. పుష్ప 2

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 12 , 2024 | 04:18 PM