ANR100: ఏఎన్నార్‌ను స్మరించుకున్న చిరు, బాలయ్య

ABN, Publish Date - Sep 20 , 2024 | 06:03 PM

లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు శత జయంతిని పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ ఆయనని స్మరించుకుంటున్నారు. ఏఎన్నార్ లైవ్స్ ఆన్, ఏఎన్నార్ 100 ట్యాగ్‌లతో నట సామ్రాట్‌‌కు నెటిజన్లు నీరాజనాలు పడుతున్నారు. టాలీవుడ్ నుంచి అక్కినేని ఫ్యామిలీతో పాటు పలువురు ప్రముఖులు ఏఎన్నార్‌ని స్మరించుకుంటూ.. ఆయన గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు.

ANR, Balayya and Chiranjeevi

లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు శత జయంతిని పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ ఆయనని స్మరించుకుంటున్నారు. ఏఎన్నార్ లైవ్స్ ఆన్ (ANR Lives On), ఏఎన్నార్ 100 (ANR100) ట్యాగ్‌లతో నట సామ్రాట్‌‌కు నెటిజన్లు నీరాజనాలు పడుతున్నారు. టాలీవుడ్ నుంచి అక్కినేని ఫ్యామిలీతో పాటు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, సాయిధరమ్ తేజ్ వంటివారంతా ఈ దసరా బుల్లోడిని స్మరించుకుంటూ.. ఘనంగా నివాళులు అర్పించారు. (ANR 100th Birth Anniversary)

అక్కినేని, కొవెలమూడి కుటుంబాలని ఒక్కటిగానే భావిస్తాం. ఎఎన్ఆర్‌గారు హైదరాబాదు‌కు అన్నపూర్ణ స్టూడియోస్‌ను ఇచ్చారు. ఎన్ని సినిమాలు చేశామనేది కాదు.. ఎలాంటి గొప్ప సినిమాలు చేసారనేది చూస్తే.. దేవదాస్, కాళిదాసు, విప్రనారాయణ, ప్రేమాభిషేకం లాంటి సినిమాలను మరలా ఊహించగలమా.. అంటూ ANR 100 Film Festival లైవ్ ఈవెంట్‌లో పేర్కొన్నారు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు (K Raghavendra Rao).

Also Read- Jani Master: నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్.. రిమాండ్ రిపోర్ట్ ఇదే


‘‘లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావుగారిని శత జయంతి సందర్భంగా స్మరించుకుంటూ.. ఎఎన్ఆర్ అలనాటి గొప్ప నటులలో ఒకరు. నటనలో మేధావి. వారు పోషించిన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో మరియు మనస్సులలో చిరస్మరణీయంగా ఉన్నారు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. ‘మెకానిక్ అల్లుడు’ సినిమాలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం, అదృష్టం నాకు దక్కింది. ఆ క్షణాలను, అద్భుతమైన జ్ఞాపకాలను ఎప్పటికీ గౌరవిస్తాను’’ అని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఏఎన్నార్‌కు నివాళులు అర్పించారు.


తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అక్కినేని నాగేశ్వరరావుగారి శతజయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గర్వకారణం. మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పాత్రలు, తెలుగు సినిమాకు ఆయన చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయాలు. ఆయన కృషి, కీర్తి మరియు స్ఫూర్తి ప్రతి నటునికి మార్గదర్శకం. ఈ శతజయంతి సందర్భంగా, తెలుగు సినీరంగానికి ఆయన అందించిన అపారమైన సేవలకు మనమందరం శిరసువంచి కృతజ్ఞతలు తెలపుదాం. నాటకరంగం నుంచి చిత్రరంగం వరకు, ఆయన చేసిన ప్రయాణం ప్రతి ఒక్కరికీ ప్రేరణ. ఈ రోజు, ఆయనకు మనమందరం నివాళి అర్పిస్తూ, ఆయన నటన, కృషి మరియు పట్టుదలతో వెలసిన విజయాలను స్మరించుకుందాం’’ అని నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఓ లేఖను విడుదల చేశారు.


ఒక చరిత్రకు శ్రీకారం.. ఒక అద్భుతం.. ఒక ఆదర్శం.. సినిమా ఉన్నంత కాలం అక్కినేని నాగేశ్వరరావుగారి పేరు అజరామరం. ANR శత జయంతి సందర్భంగా ఆ మహా నటుడిని గుర్తు చేసుకుంటూ.. అని సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) సోషల్ మీడియా వేదికగా అక్కినేని రేర్ ఫొటోని షేర్ చేశారు.

Read Latest Cinema News

Updated Date - Sep 20 , 2024 | 06:03 PM