Case File on Chinmayi: చిన్మయి వ్యాఖ్యలపై హెచ్ సీయూ స్టూడెంట్ పోలీసులకు ఫిర్యాదు!
ABN, Publish Date - Feb 29 , 2024 | 01:12 PM
సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన వాయిస్‌తో ఎంతగా పాపులర్ అయిందో... వివాదస్పద వ్యాఖ్యలతో అంతకంటే ఎక్కువ పాపులర్ అయింది.
సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద (Chinmayi) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన వాయిస్‌తో ఎంతగా పాపులర్ అయిందో... వివాదస్పద వ్యాఖ్యలతో అంతకంటే ఎక్కువ పాపులర్ అయింది. ఇటీవల సీనియర్ నటి అన్నపూర్ణమ్మ (Annapurnamma) వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఓ వీడియో రిలీజ్ చేసింది చిన్మయి. అయితే ఆ వీడియోలో చిన్మయి వ్యాఖ్యపై గచ్చిబౌలి పోలీసులకు ఓ విద్యార్థి ఫిర్యాదు చేశారు. దీంతో చిన్మయి శ్రీపాద పై కేసు నమోదు అయింది(Case file).
ఒకప్పుడు తల్లి పాత్రలకు కేరాఫ్ అయిన అనపూర్ణమ్మ ప్రస్తుతం బామ్మ పాత్రలతో అలరిస్తోంది. అలాగే టీవీ కార్యక్రమాల్లోనూ సందడి చేస్తోంది. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిళలను కించపరుస్తూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 12 తరవాత ఆడది బయట తిరగాల్సిన అవసరం ఏముందని, అమ్మాయిల కట్టూ బొట్టూ కూడా మారాలని, వాటిని చూేస అబ్బాయిలు వెంటపడుతున్నారని, అది అబ్బాయిల తప్పు కూడా కాదని ఆమె మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై పలువురు అభ్యుదయ మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలకు అమ్మాయిలే కారణమన్నట్టు అన్నపూర్ణ మాట్లాడుతున్నారని ఆమెను తప్పుబడుతున్నారు.
ఇలాంటి విషయాలపై ఎప్పుడూ కఠినంగా స్పందించే చిన్మయి కూడా స్పందించింది. ఎంత ఎమర్జెన్సీ అయినా అమ్మాయిలు బయటకు రావొద్దని, ఆరు దాటితే ఆసుపత్రిలో పేషెంట్లుగా కూడా ఉండొద్దని, డాక్టర్లుగా అస్సలు అమ్మాయిలు ఉండకూడదని వ్యంగ్యంగా మాట్లాడింది. దీనిపై చిన్మయి ఓ వీడియో విడుదల చేసింది. ుూఇప్పటికీ చాలా ఊర్లలో బాతరూమ్‌లే లేవు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఆడవాళ్లు ఎప్పుడు వస్తారా? వాళ్లపై ఎప్పుడు అఘాయిత్యానికి పాల్పడుదామా? అని ఎదురుచూస్తున్నవాళ్లు ఈ సమాజంలో ఉన్నారు. అయినా అమ్మాయిల వేషధారణ వల్లే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇండియాలో అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ. ఎంతో కర్మ చేసుకుంటే ఇలాంటి స్టుపిడ్ కంట్రీలో పుడతాం’ అని అన్నపూర్ణమ్మ మాటలకు కౌంటర్ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలపై హెద్రాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన ఓ యువకుడు సాగర్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతదేశంలో అమ్మాయిలుగా పుట్టడం కర్మ అని, స్టుపిడ్ కంట్రీ అంటూ దేశాన్ని కించపరిచేలా అగౌరవంగా మాట్లాడిన చిన్మయిపై కేసు నమోదు చేయాలంటూ సదరు యువకుడు ఫిర్యాదు చేశారు. దాంతో చిన్మయిపై కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు.