C kalyan - Film Chamber: సమష్టిగా ముందుకెళ్తాం.. సమస్యలు పరిష్కరిస్తాం!

ABN, Publish Date - Jul 28 , 2024 | 08:47 PM

ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికలు (Film Chamber) ఆదివారం జరిగాయి. నూతన అధ్యక్షుడిగా భరత్ భూషణ్‌ ఎన్నికయ్యారు. ఎన్నికల రిజల్ట్‌ అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సి.కల్యాణ్‌ మాట్లాడారు

ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికలు (Film Chamber) ఆదివారం జరిగాయి. నూతన అధ్యక్షుడిగా భరత్ భూషణ్‌ ఎన్నికయ్యారు. ఎన్నికల రిజల్ట్‌ అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సి.కల్యాణ్‌ మాట్లాడారు(C kalyan). ఛాంబర్‌ ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు పొందిన ఇద్దరు మాటకు కట్టుబడి ఉంటారు. వీరి ఆధ్వర్యంలో చాంబర్‌ విజయవంతంగా నడుస్తుందని నమ్ముతున్నా. అందరు కలసి మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తాము. గెలిచిన వారందరికీ సభ్యులందరి మద్దతు వుంటుంది.  ఇండస్ట్రీలో చాలా సమస్యలున్నాయి. అందరం సమిష్టిగా ముందుకు వెళ్తాము’’ అని అన్నారు. జనరల్‌ సెక్రెటరీ ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ "చాంబర్‌ అంతా ఒక కుటుంబం. ఇండస్ట్రీలోని సమస్యలను ఎలా ఎదుర్కోవాలో అందరం కలసి చర్చిస్తాం. భారత దేశంలోని ఇతర సినీ ఇండస్ట్రీని ఒకతాటి పైకి తీసుకొచ్చి ముందుకెళ్తాము’’ అని అన్నారు. 

Updated Date - Jul 29 , 2024 | 12:58 AM