C Kalyan: జానీ వివాదం.. ఇండస్ట్రీకి తప్పుడు సంకేతాలిస్తున్నారు
ABN, Publish Date - Sep 21 , 2024 | 08:04 PM
కొరియోగ్రాఫర్ జానీ (Jani Master) వేధింపుల కేసును కమిటీ సరిగా డీల్ చేయటం లేదని సి .కల్యాణ్ (C Kalyan)విమర్శించారు. బాధిత మహిళ పోలీసు కేసు పెట్టాక.. కమిటీ సభ్యులు ప్రెస్‌మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.
కొరియోగ్రాఫర్ జానీ (Jani Master) వేధింపుల కేసును కమిటీ సరిగా డీల్ చేయటం లేదని సి .కల్యాణ్ (C Kalyan)విమర్శించారు. బాధిత మహిళ పోలీసు కేసు పెట్టాక.. కమిటీ సభ్యులు ప్రెస్‌మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. జానీ కేసు సినీ ఇండస్ట్రీపై తప్పుడు సంకేతాలను సృష్టించింది. సినిమా పరిశ్రమలో అందరూ ప్రొఫెషనల్‌గా ఉంటూ పని చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ లో మహిళా టెక్నిషియన్స్‌ను చూసి తోటి వారు ఇబ్బంది పడే పరిస్థితి కలిగింది. ఎప్పుడో లైంగికంగా వేధిస్తే ఇప్పుడు ఆరోపణలు చేయడం ఏంటి? ఇప్పుడు ఆరోపణలు చేసిన ఆ అమ్మాయికి ఏ నిర్మాత ఆఫర్స్ ఇస్తాడు’’ అని ప్రశ్నించారు. పని కావల్సినవాళ్లు ప్రొఫెషనల్‌గా ఇండస్ట్రీలో పని చేసుకుంటారు. ఇలాంటి వివాదాలు ఇండస్ట్రీకి కొత్తేమీ కాదు. కానీ ఈ ఇష్యూని మరింత పెద్దదిగా చేసి ఇండస్ట్రీని వార్తల్లో నిలచేలా చేశారు అని సి.కల్యాణ్ మండిపడ్డారు. (C Kalyan Fire on Chamber members)
"ప్రతిభ, క్రమశిక్షణ ఉన్న వారికే ఇండస్ర్టీలో అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం గైడ్‌లైన్స్ ఇస్తే ఇండస్ర్టీలో కమిటీకి బలం చేకూరుతుందనేది అబద్దం’’ అని ఆయన అన్నారు. నిజంగా జానీ తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే! ఇదంతా అతను దోషి అని తేలిన తర్వాతే. ఈ వివాదం చట్టం పరిధిలో ఉంది. సరైన తీర్పు చట్టమే ఇస్తుంది. పరిస్థితులు చూస్తే జానీ మాస్టర్ కెరీర్‌ను పాడు చేసే ప్రయత్నం జరుగుతోందనిపిస్తుంది. ఇలాంటి వివాదాలతో ఇండస్ట్రీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. అలాగే బాలచందర్ గారి మీద ఓ మహిళ ఇలాంటి ఆరోపణలే చేసింది. ఇలాంటి తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు తిప్పికొట్టాలి. అలాంటి గొప్ప వ్యక్తి గురించి తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పుతో కొట్టాలి.