Telugu Movies Collections: టాక్ వీక్.. అయినా మొదటిరోజు కలెక్షన్స్ మాత్రం!?

ABN , Publish Date - Jun 01 , 2024 | 07:45 PM

ఒకప్పుడు ఫేక్ కలెక్షన్స్ అంటూ స్టార్ హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్‌లు జరుగుతూ ఉండేవి. ఇప్పుడు స్టార్ హీరోలనే కాదు.. చిన్న, పెద్ద, ఓ మోస్తర్ హీరోల సినిమాలకు కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టించేస్తున్నారు మేకర్స్. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన సినిమాలకు సంబంధించి మేకర్స్ మొదటి రోజు కలెక్షన్ల వివరాలతో పోస్టర్ వదలడంతో.. ఈ కలెక్షన్ల వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

Telugu Movies Collections: టాక్ వీక్.. అయినా మొదటిరోజు కలెక్షన్స్ మాత్రం!?
Gangs Of Godavari and Gam Gam Ganesha Stills

ఒక వైపు ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని, థియేటర్లు మూసేస్తున్నామనే మాటలు వినిపిస్తున్నా.., మరో వైపు ఓటీటీ రాజ్యమేలుతుందనే టాక్ వైరల్ అవుతున్నా.. తెలుగు సినిమాలకు మాత్రం టాక్‌తో పని లేకుండా బాక్సాఫీస్ (Box Office) దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తుందని మేకర్స్ పోస్టర్ విడుదల చేయడం చూస్తుంటే.. ఇది ఒక్క టాలీవుడ్‌కు మాత్రమే సాధ్యం అనేలా కొందరు విమర్శకులు కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఒకప్పుడు ఫేక్ కలెక్షన్స్ అంటూ స్టార్ హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్‌లు జరుగుతూ ఉండేవి. ఇప్పుడు స్టార్ హీరోలనే కాదు.. చిన్న, పెద్ద, ఓ మోస్తర్ హీరోల సినిమాలకు కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టించేస్తున్నారు మేకర్స్. ఇదంతా చూస్తుంటే ఆ మధ్య ఓ నిర్మాత ఈ కలెక్షన్ల గురించి చెబుతూ.. ఆడియెన్స్‌ని అట్రాక్ట్ చేసేందుకే అలా కలెక్షన్స్ పెంచి చెబుతుంటామనేది నిజమని అనిపిస్తుంటోంది. ఇప్పుడిదంతా ఎందుకూ అంటే.. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన సినిమాలకు సంబంధించి మేకర్స్ మొదటి రోజు కలెక్షన్ల (First Day Collections) వివరాలతో పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్స్ చూస్తుంటే.. ఈ మ్యాటర్ ఇట్టే అర్థమైపోతుంది.

Also Read: Super Star Krishna Brother: ఈ ఫొటోలో ఉన్నది కృష్ణ కాదంటే ఎవరైనా నమ్మగలరా?


Gangs-Of-Godavari.jpg

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మొదటిరోజు కలెక్షన్స్- 8.2 కోట్లు (Gangs Of Godavari First Day Collections)

సరే ఆ పోస్టర్స్ విషయానికి వస్తే.. ముందుగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా వాళ్లు.. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 8.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టినట్లుగా మేకర్స్ పోస్టర్ వదిలారు. వాస్తవానికి ఈ సినిమా విడుదలకు ముందు బీభత్సమైన అంచనాలను పెంచుకుంది. నటసింహం బాలకృష్ణ ప్రీ రిలీజ్ వేడుకకు రావడం కూడా ఈ సినిమా ప్రేక్షకులలోకి వెళ్లేలా చేసింది. అంజలి, నేహాశెట్టి వంటి వారితో పాటు టాప్ బ్యానర్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను నిర్మించడంతో ఈ సినిమాపై భారీగానే క్రేజ్ ఏర్పడింది. కాకపోతే తొలి రోజు ఈ సినిమా మిశ్రమ టాక్‌కే పరిమితమైంది. అయినా కూడా ఈ సినిమా 8.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం.

Gam-Gam-Ganesha.jpg

‘గం.. గం.. గణేశా’ మొదటిరోజు కలెక్షన్స్- 1.82 కోట్లు (Gam Gam Ganesh First Day Collections)

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘గం..గం..గణేశా’ సినిమా మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 1.82 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లుగా మేకర్స్ పోస్టర్ వదిలారు. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఈ సినిమా కూడా మొదటిరోజు మిశ్రమ టాక్‌కు పరిమితమైంది. ఈ రెండు సినిమాలతో పాటు యువీ క్రియేషన్స్ సమర్పించిన ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam) సినిమా కూడా ఈ శుక్రవారమే విడుదలైంది.

Read Latest Cinema News

Updated Date - Jun 01 , 2024 | 07:50 PM