G.O.A.T: సుడిగాలి సుధీర్ G.O.A.T నుంచి.. 'సెలబ్రెటి నీకన్న ఎవడురా' లిరిక‌ల్ వీడియో విడుద‌ల

ABN, Publish Date - Aug 18 , 2024 | 03:12 PM

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గోట్. తాజాగా ఈ చిత్రం నుంచి 'బాసే హే నీలా ఉండే లక్కు మాకే లేదురా.. సెలబ్రిటీ నీకన్న ఎవడురా' అనే లిరికల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.

goat

జ‌బ‌ర్ద‌స్త్ సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గోట్ (G.O.A.T) Greatest Of All Time అనేది ట్యాగ్‌లైన్. దివ్యభారతి (Divya Bharathi) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి విశ్వ‌క్ సేన్‌ ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణ‌వ్ ప్రొడ‌క్ష‌న్స్ సంయిక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత‌. ఈ మ‌ధ్య‌ ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన ‘అయ్యో పాపం సారూ..’ అనే ఓ బ్యూటిఫుల్ లిరిక‌ల్ వీడియో చార్ట్‌బస్టర్‌గా నిలిచి శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది.

తాజాగా ఈ చిత్రం నుంచి హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్‌గా.. హీరో క్యారెక్టర్‌ గురించి చెప్పే 'బాసే హే (BOSS-EH) నీలా ఉండే లక్కు మాకే లేదురా.. సెలబ్రిటీ నీకన్న ఎవడురా' అనే లిరికల్‌ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ (Kasarla Shyam) సాహిత్యం అందించిన ఈ పాటకు లియోన్ జేమ్స్ (Leon James) సంగీతం అందించారు.


హీరో సుధీర్‌(Sudigali Sudheer)పై చిత్రీక‌రించిన ఈ పాటను ఇటీవల పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్‌ అంటూ పుష్ప-2లోని టైటిల్‌ సాంగ్‌ని పాడి పాపులరైన దీపక్‌ బ్లూ (Deepak Blue) ఈ పాటను ఆలపించడం విశేషం. కోరియోగ్రాఫర్‌ జీతు మాస్టర్‌ ఈ పాటకు డ్యాన్స్ స‌మ‌కూర్చగా.. విన‌సొంపైన బాణీల‌తో, క్యాచీ ప‌దాల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకునే విధంగా ఉంది. నిర్మాత మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎనభై శాతం షూటింగ్‌ పూర్తయింది. టాకీ పార్ట్‌ దాదాపు పూర్తి చేశాం, యాక్షన్‌ ఏపిసోడ్స్‌, రెండు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. త్వరలో చిత్రీకరిస్తామ‌న్నారు.

కాగా ఈ చిత్రానికి ఆగ్ర టెక్నీషియ‌న్స్ ప‌ని చేస్తున్నారు. సంగీతం: లియోన్ జేమ్స్ అందిస్తుండ‌గా, డీఓపీ: ర‌సూల్ ఎల్లోర్‌, ఎడిటర్: కె.విజయవర్ధన్, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ : రాజీవ్ నాయర్, రచయిత: ఫణికృష్ణ సిరికి, కో ప్రొడ్యూస‌ర్‌: ర‌వీంద్ర రెడ్డి.ఎన్‌, క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌: ప్ర‌సూన మండ‌వ‌, రైటర్‌: ఫణిక్రిష్ణ సిరికిరి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: వీఎన్‌ రావు, ఫైట్స్‌: రాబిన్‌సుబ్బు

Updated Date - Aug 18 , 2024 | 03:12 PM