Bolisetty Srinivas: అల్లు అర్జున్.. జాగ్రత్తగా మాట్లాడు.. నేను కచ్చితంగా వస్తా!
ABN, Publish Date - Aug 27 , 2024 | 09:02 PM
అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద యుద్థమే జరుగుతోంది. బన్నీ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి శిల్పా రవికి మద్దతు తెలుపుతూ తన ఇంటికి వెళ్లినప్పటి నుంచి ఈ యుద్ధం మరింత పెద్దదైంది.
అల్లు అర్జున్ కు ఫాన్స్ ఉన్నారా?
అయన అలా ఉహించుకుంటున్నాడేమో..
ఇక్కడ ఉన్నది మెగా ఫాన్స్ మాత్రమే..
విడిపోయి.. బ్రాంచీలు, షామియానా కంపెనీలు పెట్టుకున్నారేమో తెలీదు
నిన్నేమైనా రమ్మని అడిగామా?
గతం మర్చిపోయి పెద్ద పుడింగిని అనుకోకు...
- అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కామెంట్స్
అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద యుద్థమే జరుగుతోంది. బన్నీ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి శిల్పా రవికి మద్దతు తెలుపుతూ తన ఇంటికి వెళ్లినప్పటి నుంచి ఈ యుద్ధం మరింత పెద్దదైంది. ఇప్పటికే ఈ అంశం మీద అనేక మంది స్పందించారు. అటు మెగా ఫ్యామిలీ నుంచి ఇటు అల్లు ఫ్యామిలీ నుంచి పలు సందర్భాల్లో పలువురు స్పందించారు. తాజాగా జనసేన ఎమ్మెల్యే అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఓ వేదిక అల్లు అర్జున్ "నాకు నచ్చితేనే వస్తా.. ఇష్టమైతేనే వస్తా’ అని చేసిన వ్యాఖ్యలపై తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ను స్పందించమని ఓ జర్నలిస్ట్ కోరగా "అసలు అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్ ఉన్నారా? ఆ సంగతి నాకు తెలియదు. మామూలుగా నాకు తెలిసి ఉన్నదంతా మెగా ఫ్యాన్సే. మెగా కుటుంబం నుంచి విడిపోయి వచ్చిన వ్యక్తులు బ్రాంచ్‌లుగానీ, షామియానా కంపెనీలాగా ఏమైనా పెట్టుకుంటే మాకు తెలియదు. కానీ ఉన్నదే మెగా ఫ్యాన్స్. ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ. అంతే తప్ప అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. ఆయన అలా ఊహించుకుంటున్నాడు ఏమో! ఆయన స్థాయి మరిచిపోయి మాట్లాడుతున్నాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి’’ అని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. చిరంజీవి గారి అభిమానులు నీతో ఆయన్ని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్‌కల్యాణ్‌ని చూసుకుంటున్నారు. ఆయన్ని కాదు నేను పెద్ద పుడింగిని.. నాకు ఇష్టమైతేనే వస్తా అంటే మానేసి వెళ్ళిపో. ఎవడికి కావాలి? నిన్నేమైనా రమ్మని అడిగామా? నువ్వు వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? 21 చోట్ల నిలబడితే 21 స్థానాల్లో గెలిచాం. నువ్వు వెళ్లిన ఒక్క సీటు కూడా ఓడిపోయింది. మీ నాన్న ఎంపీగా నిలబెడితే నువ్వు నెగ్గించలేదు నువ్వు, అందరినీ విమర్శించడం మంచిది కాదు’’ అని బొల్లిశెట్టి కామెంట్ చేశారు.
కచ్చితంగా వస్తా..
అయితే ఇదే విషయంపై మరోసారి ట్విట్టర్ వేదికగా ఆయన బొల్లిశెట్టి స్పందించారు. "నాకు ఇష్టమైతేనే వస్తా’ ఒక మెగా అభిమానిగా చిరంజీవిగారిని గానీ, నాగబాబు, పవన్ కల్యాణ్‌గారిని కానీ గౌరవం లేకుండా మాట్లాడితే నేను వస్తా. గతాన్ని మర్చిపోయి మాట్లాడితే కచ్చితంగా వస్తా. మరి ముఖ్యంగా నేను చెప్పదలచుకున్నది ఏమంటే నా వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతం, ఒక మెగా అభిమానిగా మాత్రమే నేను స్పందించా, గమనించగలరు అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.