Prabhas: 'డార్లింగ్'కి అభినందనల వెల్లువ
ABN, Publish Date - Oct 23 , 2024 | 03:42 PM
నేడు 45వ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు తమదైన శైలిలో విషెస్ చెప్పారు.
ప్రభాస్.. ఆరు అడుగుడుల యాక్షన్ కటౌట్ మాత్రమే కాదు నిలువెత్తు ప్రేమకి ప్రతిరూపం. ఒకవైపు సినిమాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొడుతూనే.. తన ప్రేమ, ఆప్యాయతలతో అందరి మనసుల్ని దోచుకుంటు మనసున్న మకుటంలేని మహారాజుగా ప్రభాస్ రాజు ఎదిగారు. అయితే నేడు 45వ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు తమదైన శైలిలో విషెస్ చెప్తున్నారు.
మొదటగా మెగాస్టార్ చిరంజీవి 'X' వేదికగా "ఆ కట్ అవుట్ చూసి అందరూ నమ్మాలి డ్యూడ్! అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమిస్తాం. హ్యాపీ బర్త్ డే డార్లింగ్ ప్రభాస్! మీరు ప్రేమ, సంతోషం, గొప్ప కీర్తి పొందాలని కోరుకుంటున్నాను".అంటూ తనదైన స్టైల్లో విష్ చేశారు.
ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ట్వీట్ చేస్తూ.. "నిబద్ధత, కోరిక, ప్రతిభ, సంసిద్ధత, కఠోర శ్రమ, వినయం అన్నీ కలిస్తేనే గెలుపు ఖాయం.. నువ్వే విజేత" అంటూ డార్లింగ్‌కి విష్ చేశారు.
గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' నా ప్రియమైన మిత్రుడు ప్రభాస్‌కి జన్మదిన శుభాకాంక్షలు, మీరు దీర్ఘాయువుతో, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశాడు.
స్వీటెస్ట్ ప్రభాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు! మీకు శాంతి, ప్రేమ, రుచికరమైన ఆహారంతో నిండిన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను అంటూ విక్టరీ వెంకటేష్ ట్వీట్ చేశాడు.
ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్, హీరో గోపీచంద్ "మై డియర్ ప్రభాస్ భారతదేశంలోని అతి పెద్ద స్టార్లలో ఒకరిగా, ని వినయపూర్వకమైన, నిరాడంబరమైన స్వభావం నిన్ను గొప్ప స్థానాలకు తీసుకెళ్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున, నీకు అర్హమైన ప్రతిదానిలో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను" అని రాసుకొచ్చారు.
ఇక చిన్న సినిమాలతోనే పాన్ ఇండియా క్రేజ్ కొట్టేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. మీ కెరీర్‌లోని ప్రదర్శనల.. మీ అత్యున్నత స్వభావంతో అటు నటుడిగా, ఇటు మానవతావాదిగా స్టాండర్డ్స్ పెంచారు. మీకు మీరే సాటి అంటూ.. తనదైన శైలిలో విష్ చేశాడు.
వీరితో పాటు నాని, విజయ్ దేవరకొండ పలువురు స్టార్ సెలబ్రిటీలు వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రభాస్‌కి ఘనంగా విష్ చేశారు.