Biggboss 8: బిగ్‌బాస్‌ తెలుగు - 8 ఇంటి సభ్యులు వీరే! 

ABN, Publish Date - Sep 01 , 2024 | 08:29 PM

తెలుగు రియల్టీ షో బిగ్‌బాస్‌ సరికొత్త సీజన్‌ షురూ అయింది.  ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫన్‌, టర్న్‌లు,  ట్విస్ట్‌లకు లిమిటే లేదు అంటూ టీజర్‌లో వ్యాఖ్యత నాగార్జున సందడి చేశారు.

తెలుగు రియల్టీ షో బిగ్‌బాస్‌ (Biggboss 8) సరికొత్త సీజన్‌ షురూ అయింది.  ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫన్‌, టర్న్‌లు,  ట్విస్ట్‌లకు లిమిటే లేదు అంటూ టీజర్‌లో వ్యాఖ్యత నాగార్జున (Akkineni NAgarjuna) సందడి చేశారు. ఇన్ఫినిటీ ఆఫ్‌ ఫన్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరుతో మొదలైన ఈ సీజన్‌లో హౌస్‌మేట్స్‌ను ఇద్దరిద్దరు చొప్పున హౌస్‌లోకి పంపారు. 

తొలి కంటెస్టెంట్‌ యష్మి

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-8లో తొలిసారి అడుగు పెట్టే అవకాశాన్ని దక్కించుకుంది నటి యష్మి(yashmi). బుల్లితెరపై సీరియల్స్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిమితమే. హౌస్‌లోకి వెళ్లేముందు యష్మి మాట్లాడుతూ.. ‘‘నాకు ప్రస్తుతం ఏ బాయ్‌ఫ్రెండ్‌ లేడు. ఒకప్పుడు ఉండేవాడు. నా మూడ్‌ స్వింగ్స్‌ భరించలేక నేనే అతడిని పంపేశా. పెళ్లిపై ఎలాంటి అభిప్రాయం లేదు. మొదట రిలేషన్‌షిప్‌, లవ్‌ ఓకే అయిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుంటా. పెద్దలు కుదిర్చిన పెళ్లి అస్సలు చేసుకోను. నాకు వంట చేయడం రాదు. బిర్యానీ లేకుండా అసలు ఉండలేను. ఆకలేేస్త కోపం వస్తుంది. నేను చెప్పిన పని చేయకపోయినా, అబద్థం చెప్పినా కోపం వస్తుంది. హౌస్‌లో నాకెలాంటి స్ట్రాటజీలు లేవు. గొప్ప పోటీ మాత్రం ఇస్తా’’ అని చెప్పింది.

ఇంటి సభ్యులు వీరే 

1. యష్మి

2. నిఖిల్‌

3. అభయ్‌ నవీన్‌

4. ప్రేరణ

5. ఆదిత్య ఓం

6. సోనియ

7. పాప్ సింగర్ మధు 

8. శేఖర్ బాషా 

మిగతా కంటెస్టెంట్స్‌ లిస్ట్  అప్‌డేట్ అవుతోంది....

Updated Date - Sep 01 , 2024 | 08:38 PM