Devara: ‘దేవర’పై అంచనాలు తప్పాయా.. యుఎస్‌కు వెళ్లిపోతున్న తారక్..
ABN , Publish Date - Sep 13 , 2024 | 04:07 PM
‘దేవర’ సినిమాకు ఎన్టీఆర్ కూడా షాక్ ఇవ్వబోతున్నారా? అంటే అవుననే సమాధానమే సోషల్ మీడియాలో వినిపిస్తోంది. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రాబోతోన్న ఈ సినిమాపై.. ట్రైలర్ విడుదల అనంతరం ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఈ టీమ్‌కు షాక్ ఇస్తూ యుఎస్ వెళ్లిపోతున్నాడనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’ (Devara). కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు. సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధమైన ఈ సినిమాపై.. ఎప్పుడైతే ట్రైలర్ విడుదలయిందో.. అప్పటి నుంచి సినీ అభిమానులు, నెటిజన్లు ఈ సినిమాను చూస్తున్న కోణం పూర్తిగా మారిపోయింది.
Also Read- Devara: డబ్బులిచ్చి ‘జై’ కొట్టించుకున్నారా..
ముఖ్యంగా ట్రైలర్ చూసిన వారంతా చప్పగా ఉందంటూ.. ‘పాదఘట్టం 2’ అంటూ పెదవి విరుస్తుండటం గమనార్హం. ఈ సినిమాపై మేకర్స్ ఎంతగా హడావుడి చేసినా.. అనుకున్నంత హైప్ మాత్రం రావడంలేదనేలా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారిగా ఇలా అంచనాలు తగ్గిపోవడంతో సినిమా టీమ్‌కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొందని టాక్ వినబడుతోంది. నిజానికి ‘దేవర’ సినిమాకు ఈ గతి పట్టడానికి కారణం కూడా చిత్ర యూనిట్ అత్యుత్సాహమే. సినిమా మేకింగ్‌లో ఉండగానే అనవసరమైన హైప్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.
‘దేవర’ సినిమా టాలీవుడ్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ అంటూ గతంలో కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలకు తోడు, ‘దేవర’కు వర్క్ చేసిన డబ్బింగ్ ఆర్టిస్ట్‌లు చెప్పిన కబుర్లు, కామెంట్లు చూసి ఆడియన్స్ ఈ సినిమాను మరీ ఎక్కువ ఊహించుకోగా.. తీరా ట్రైలర్ విడుదలైన తర్వాత ఏ ఒక్క యాంగిల్‌లోనూ కొత్తదనం కనిపించలేదు. ప్రతి షాట్ ‘ఆచార్య’నే తలపిస్తుండటంతో అభిమానులకు సైతం నీరసం వచ్చేసింది. అంచనాలు పెరిగితే, దానికి తగ్గ విషయం సినిమాలో ఉండాలి.. లేకుంటే ఆడియన్స్ నిరాశ పడే ఛాన్స్ ఉంటుందని ‘దేవర’ విషయంలో క్లియర్‌గా కనిపిస్తోంది. ఈ క్రమంలో యంగ్ హీరోలతో కలిసి ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాను పైకి లేపే ప్రయత్నాల్లో ఉన్నారు. సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌లతో కలిసి జూనియర్ ఎన్టీఆర్‌ను ఇంటర్యూ చేయించి.. ‘దేవర’కు జరిగిన డ్యామేజ్‌ను కాస్తైనా తగ్గించాలనే ఆలోచనలో టీమ్ ఉంది.
Also Read- Mathu Vadalara 2 Review: శ్రీసింహా నటించిన కామెడీ థ్రిల్లర్ 'మత్తు వదలరా 2' ఎలా ఉందంటే
ఇక కొరటాల శివ గత చిత్రం ‘ఆచార్య’తో పోలిక ‘దేవర’ను సోషల్ మీడియాలో బాగా ఇబ్బంది పెడుతోంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో టీమ్‌కు కూడా అర్థం కావడంలేదట. ఇన్ని డ్రాబ్యాక్‌ల మధ్య ‘దేవర’కు ఇండియాలో వసూళ్లు వస్తాయా? రావా? అనేలా అనుమానాలు ఎక్కువయ్యాయి. చివరికి ఎన్టీఆర్ కూడా ఈ సినిమా రిలీజ్ టైమ్‌కు యుఎస్‌కు వెళ్లిపోవాలని డిసైడ్ అవడంతో.. చివరి మూమెంట్‌లో ఎన్టీఆర్ కూడా చేతులెత్తేస్తున్నాడనేలా అప్పుడే టాక్ మొదలైంది. కాలిఫోర్నియాలో జరగబోయే బియాండ్ ఫెస్ట్‌లో ‘దేవర’ ప్రదర్శనకు జూనియర్ ఎన్టీఆర్ అమెరికా వెళుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి.. ‘దేవర’ ఎలా గట్టెక్కుతాడో..
Read Latest Cinema News