మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bhagavanth Kesari: హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ABN, Publish Date - May 25 , 2024 | 10:40 AM

నందమూరి నటసింహం బాలయ్య (NBK) నటించిన ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రం గత ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నందమూరి నటసింహం బాలయ్య (NBK) నటించిన ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రం గత ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాజల్‌ కథానాయికగా నటించింది. ఈ సినిమాలో యంగ్‌ బ్యూటీ శ్రీలీల (Shree leela) ముఖ్య పాత్రలో నటించింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ విలన్‌గా నటించాడు. ఈ మూవీని షైన్‌  స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించగా.. ఈ మూవీ 70 కోట్లకు పైగా షేర్‌ ని అలాగే 132 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ సినిమాలో తెలంగాణ యాసలో బాలయ్య చెప్పే డైలాగ్స్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేటర్స్‌లోనే కాదు ఓటీటీలో కూడా మంచి రేటింగ్‌తో అదరగొట్టింది. తాజాగా ఈ బిగ్గెస్ట్‌ యాక్షన్‌ మూవీ హిందీ వెర్షన్‌  స్ట్రీమింగ్  రైట్స్‌ను జియో సినిమా సొంతం చేసుకుంది. ప్రస్తుతం హిందీ వెర్షన్ లో  స్ట్రీమింగ్ అవుతోంది.  

Updated Date - May 25 , 2024 | 10:40 AM