Biggboss 8 Elimination: అతనిని నమ్మాను కాబట్టే నేను బయట ఉన్నా

ABN, Publish Date - Sep 09 , 2024 | 10:57 AM

బిగ్‌బాస్‌ సీజన్‌-8 మొదలై వారం పూర్తయింది. తొలి ఎలిమినేషన్‌ కూడా జరిగిపోయింది.


బిగ్‌బాస్‌ సీజన్‌-8 (Biggboss -8) మొదలై వారం పూర్తయింది. తొలి ఎలిమినేషన్‌ కూడా జరిగిపోయింది. పంచ్‌ డైలాగ్‌లు, ప్రాసలతో అలరించిన బెజవాడ బేబక్క (Bezawada bebakka) హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఈ వారం విష్ణు ప్రియ, బేబక్క, సోనియా, పృథ్వీరాజ్‌, శేఖర్‌ బాషా, నాగ మణికంఠ నామినేట్‌ అవ్వగా చివరకు బేబక్క, మణికంఠ  ఉన్నారు. ఆడియన్స్‌ నుంచి బేబక్కకు తక్కువ ఓట్లు వచ్చినట్లు నాగార్జున ప్రకటించారు. (Bebakka Eliminated)

అనంతరం వేదిక మీదకు వచ్చిన బేబక్క మాట్లాడుతూ.. ఇంత త్వరగా బిగ్‌బాస్‌ సీజన్‌-8 నుంచి బయటకు వచ్చేస్తానని అనుకోలేదు అని ఆమె అన్నారు. మరో అవకాశం కల్పిస్తే బాగా ఆడి తనని తాను నిరూపించుకుంటానని చెప్పారు. ఎలిమినేట్‌ అయినందుకు చాలా బాధగా ఉందని విచారం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ "హౌస్‌లో వారం రోజులు ప్రయాణమే అయినా చాలా బాగుంది.  ఈ జీవిత అనుభవాన్ని మర్చిపోలేను’ అని అన్నారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండటానికి అర్హతలేని వాళ్లను రోడ్డుమీద పెట్టాలంటూ హోస్ట్  నాగార్జున.. బేబక్కకు సూచించి, వారి ఫొటోలను ముందు ఉంచారు.



సోనియా: ప్రతి విషయంలోనూ ఒక నెగెటివ్‌ వైబ్‌ అనిపించింది. తనకి నేను నచ్చలేదని అర్థమైంది. నేను కూడా ఒక కంటెస్టెంట్‌లా వచ్చా అని అనగా అందుకు సోనియా వివరణ ఇస్తూ కుక్కర్‌ విషయంలో నేను అన్న చిన్న మాట కాస్త్తా మా మధ్య దూరానికి కారణమైంది అని సోనియా వివరణ ఇచ్చారు.

(Telugu biggboss -8)

పృథ్వీరాజ్‌: ఈ షోకు నేను ఫిట్‌ కానని పృథ్వీ అన్నాడు. ఫిట్‌నెస్‌ పెంచాను. నీలోనూ కోపాన్ని నియంత్రించుకోలేని తత్వం ఉంది. నామినేషన్స్‌లో నన్నూ మాటలు అన్నావు. ఆ తర్వాత సారీ చెప్పావు. ఒక తమ్ముడిలా భావించి నేనూ క్షమించాను. (Biggboss 8)

మణికంఠ: ఈ హౌస్‌లో తనకి తాను ఒంటరిగా ఉంటున్నాడు. బాగా ఆందోళన పడుతున్నారు. ఇంకా తనపై తనకు నమ్మకం పెరగాలి.



నిఖిల్‌: బిగ్‌బాస్‌లోకి వచ్చినప్పుడు కుకింగ్‌ నన్ను చూసుకోమన్నారు. ఎవరికి వాళ్లు వండుకోవడం ప్రోత్సహించ వద్దని అన్నాడు. అయితే, ఆ తర్వాత తను ఇచ్చిన సలహాను పాటించడం వల్ల హౌస్‌మేట్స్‌ ఎవరికి వారు వండుకుంటామని అన్నారు. నిఖిల్‌ రూల్స్‌ నేను పాటించి కఠినంగా ఉన్నాను. కానీ, తనే వాటిని బ్రేక్‌ చేశాడు. అతనిని నమ్మాను కాబట్టే నేను బయట ఉన్నా.
బేబక్క మాటలకు నిఖిల్‌ స్పందిస్తూ.. నేను ఇప్పటికీ చిన్న పిల్లవాడినే. నేను తెలిసో తెలియకో తప్పు చేసి ఉంటా. అక్కను రాంగ్‌గా చూపించటం నా ఉద్దేశం కాదు అన్నాడు.

Updated Date - Sep 09 , 2024 | 11:00 AM