మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bellamkonda Sreenivas: భ‌గ‌వంత్ కేసరి సినిమా ప్రోడ‌క్ష‌న్‌లో బెల్లంకొండ‌.. అదిరిపోయిన ఫ‌స్ట్ లుక్‌

ABN, Publish Date - Apr 17 , 2024 | 10:00 PM

ప్ర‌స్తుతం త‌న‌ 10వ సినిమాతో షూటింగ్‌లో బిజీగా ఉన్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ శ్రీరామ నవమి సందర్భంగా మరో అద్భుతమైన ప్రాజెక్ట్ కి సంతకం చేశారు.

bss11

చ‌త్ర‌ప‌తి సినిమాతో బాలీవుడ్‌లోకి ఆరంగేట్రం చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) మ‌ళ్లీ కాస్త విరామం త‌ర్వాత తెలుగులో బిజీ అయ్యారు. ప్ర‌స్తుతం త‌న‌ 10వ సినిమాతో షూటింగ్‌లో బిజీగా ఉన్నఆయన శ్రీరామ నవమి సందర్భంగా మరో అద్భుతమైన ప్రాజెక్ట్ #BSS11కి సంతకం చేశారు.

మంచి భావోద్వేగాలతో కూడిన కమర్షియల్ చిత్రాలను రూపొందించడంలో పేరుగాంచిన డైనమిక్ నిర్మాత సాహు గారపాటి ( Sahu Garapati), కౌశిక్ పెగళ్లపాటి (Koushik Pegallapati) రచన మరియు దర్శకత్వంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మించనున్నారు.

పోస్టర్ లో డిటైలింగ్ చూస్తే ఒక అద్భుతమైన కథగా అనిపిస్తుంది. శ్రీరాముడు తన చేతిలో విల్లుతో బాణాన్ని ఆకాశంలో ఉన్న రాక్షసుడికి ఎక్కుపెట్టడం ఈ శ్రీరామనవమి సందర్భానికి సరిగ్గా సరిపోయింది. అంతేగాక ఆ పోస్ట‌ర్‌లో తోలుబొమ్మలాట , అడవి, యాంటెన్నా టవర్ మరియు హార్నెట్ కూడా ఉండి సినిమాపై ఆస‌క్తి పెంచేలా ఉన్నాయ్‌.


భగవంత్ కేసరి సంచలన విజయం తర్వాత, షైన్ స్క్రీన్స్ (Shine Screens) ఈ ఎలక్ట్రిఫైయింగ్ హారర్ మిస్టరీతో వెండితెరపై మరో మరపురాని సినిమాటిక్ అనుభూతిని అందజేస్తుందని హామీ ఇచ్చింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం. 8ని శ్రీమతి అర్చన సమర్పిస్తుండ‌గా, కాంతారా ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్ (Ajaneesh Loknath) సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Apr 17 , 2024 | 10:01 PM