Lucky Baskhar: లక్కీ భాస్కర్ కోసం 'బాలయ్య'
ABN, Publish Date - Oct 31 , 2024 | 04:02 PM
ప్రస్తుతం రిలీజైన అన్ని చోట్ల నుండి ‘లక్కీ భాస్కర్’ సినిమాకి మంచి టాక్ వినిపిస్తుంది. మరోవైపు నందమూరి నటసింహం బాలయ్య తనదైన స్టైల్‌లో ఈ సినిమాకి మద్దతు తెలిపారు. ఈరోజు ఆయన థియేటర్ లో 'లక్కీ భాస్కర్' సినిమా చూస్తూ.. అందరిని ఆశ్చర్యపరిచాడు.
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెరకెక్కిచిన మూవీ ‘లక్కీ భాస్కర్’. ‘సాధారణ మనిషి యొక్క అసాధారణ ప్రయాణం’గా ఈ సినిమాను నిర్మించారు. నేడు (అక్టోబర్ 31) దీపావళి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేశారు. ప్రస్తుతం రిలీజైన అన్ని చోట్ల నుండి ఈ సినిమాకి మంచి టాక్ వినిపిస్తుంది. మరోవైపు నందమూరి నటసింహం బాలయ్య తనదైన స్టైల్‌లో ఈ సినిమాకి మద్దతు తెలిపారు. ఈరోజు ఆయన థియేటర్ లో 'లక్కీ భాస్కర్' సినిమా చూస్తూ.. అందరిని ఆశ్చర్యపరిచాడు.
బుధవారం రిలీజైన అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రోమోలో లక్కీ భాస్కర్ హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ వెంకీ అట్లూరి, ప్రొడ్యూసర్ నాగ వంశీలతో కలిసి బాలయ్య సందడి చేశారు. కబుర్లతో పాటు బాలయ్య తన స్టైల్లో దుల్కర్ సల్మాన్‌పై జోకులు, తికమక పెట్టె ప్రశ్నలతో, పంచ్‌లతో అదరగొట్టారు. దుల్కర్ చేత తొడగొట్టించారు. దీపావళి కానుకగా ఈ ఎపిసోడ్ ఈ రోజు రాత్రి 7 గంటలకు రిలీజ్ కానుంది. మరోవైపు ఈ ప్రోమో ఇంటర్‌నెట్‌లో వైరల్ కాగా బాలయ్య నేడు హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ సినిమా చూస్తూ మీడియా కంట పడ్డాడు. ఏది ఏమైనా ఇలాంటి పెద్ద హీరోలు థియేటర్లలో కనిపిస్తూ యంగ్ జెనరేషన్‌ని ఎంకరేజ్ చేయటం చాలా బాగుందని అభిమానులు అంటున్నారు.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. 1990ల సమయం అది. భాస్కర్ కుమార్.. ముంబై మగధ బ్యాంక్‌లో క్యాషియర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. మఽధ్యతరగతి కుటుంబం, చాలిచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. వస్తుందనుకున్న ప్రమోషన్ చేజారడంతో రూపాయి పెడితే రెండు రూపాయలు వచ్చే మార్గాలను ఎంచుకుంటాడు. తదుపరి అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా ప్రమోట్ అవుతాడు. మగధ బ్యాంక్‌లో ఆ జరిగిన స్కామ్ విచారణలో భాగంగా భాస్కర్ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ చూసి అధికారులు షాక్ అవుతారు. నెలకు రూ. 19,500 జీతం తీసుకునే ఉద్యోగి అకౌంట్‌లో రూ.వంద కోట్లు వుంటాయి. అవి ఎలా వచ్చాయి. మగధ బ్యాంక్‌లో జరిగిన స్కామ్ ఏంటి? ఈ స్కామ్‌కి హర్ష్ మెహ్రాకి ఉన్న సంబంధం ఏంటి? చివరికి స్కామ్ నుంచి భాస్కర్ గట్టెక్కాడా? అన్నది కథ.