Chandrababu Naidu: బాలయ్యకు న్యాయం చేశారా.. పవన్ వైపు ఉన్నారా
ABN, Publish Date - Oct 24 , 2024 | 12:59 PM
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి తన బావమరిది, హిందూపూర్ ఎమ్మెల్యే బాలయ్య రెండు టాస్క్ లు ఇచ్చారు. అందులో ఒకటి బాలకృష్ణకు , రెండోది ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు సంబంధించినవి. అయితే ఇద్దరిలో చంద్రబాబు బాలయ్యకు ఓటేశారా? పవన్‌కు మద్దతుగా చేశారా?
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి (Nara Chandrabbau naidu) తన బావమరిది, హిందూపూర్ ఎమ్మెల్యే బాలయ్య రెండు టాస్క్ లు ఇచ్చారు. అందులో ఒకటి బాలకృష్ణకు (Bala Krishna), రెండోది ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు(pawan Kalyan) సంబంధించినవి. అయితే ఇద్దరిలో చంద్రబాబు బాలయ్యకు ఓటేశారా? పవన్‌కు మద్దతుగా చేశారా? తెలియాలంటే ఈ శుక్రవారం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అన్‌స్టాపబుల్ సీజన్ 4 తొలి ఎపిసోడ్ చూడాల్సిందే!
అసలు విషయంలోకి వెళ్తే.. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్’ (Unstoppable) షోకు చంద్రబాబు అతిథిగా హాజరయ్యారు. దీనికి సంబంధించి టీజర్ ఇటీవల విడుదలైంది. దాన్లో బాలయ్య చంద్రబాబుతో ఎన్నో విషయాలు మాట్లాడించారు. రాష్ట్ర భవిష్యత్తు, పవన్‌తో భేటీ, ఇద్దరి మధ్య చర్చలు, జైలులో ఉన్న 53 రోజులు ఎలా గడిచాయి వంటి విషయాలతోపాటు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. బాబుకి బాలయ్య ఫన్నీ టాస్కులు ఇచ్చినట్లు చూపించారు. అందులో చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. సరదాగా, చమత్కారంగానూ మాట్లాడారు. అయితే తాజా సమాచారం ప్రకారం బాలయ్య మరో రెండు టాస్కులు చంద్రబాబుకు ఇచ్చారు.
అందులో ఒకటి ‘అన్‌స్టాపబుల్ షో’లో తన తరహాలో తొడ కొటాలని చంద్రబాబును బాలకృష్ణ అడిగారట. లేదంటే ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవర్‌స్టార్, పవన్ కళ్యాణ్ మేనరిజం చేసి చూపించమని అడిగారని తెలిసింది. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసి చూపించాలని బాలయ్య కోరారట. తొడ కొట్టడంలో బాలయ్యది సెపరేట్ స్టైల్. దానికి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింది. ఉంది. ఆయన తొడ కొడితే ఆ సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది. ఇక, పవన్ కళ్యాణ్ మేనరిజం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన మేనరిజానికి ఫ్యాన్స్ ఊగిపోతారు. మరి ఆ రెండిట్లో ఏది చేశారు? లేదంటే రెండు చేసి చూపించారా? ఇద్దరికి సమన్యాయం చేశారా? అనేది తెలియాలంటే శుక్రవారం రాత్రి 8:30 గంటలకు స్ర్టీమింగ్ అయ్యే ఎపిసోడ్ చూడాలి. ప్రతిపక్ష హోదాలో ఉన్న సమయంలో ఓసారి చంద్రబాబు ‘అన్ స్టాపబుల్’ షోకి హాజరు అయ్యారు. సీఎం అయ్యాక ఇప్పుడు మరోసారి అన్‌స్టాపబుల్ సెట్‌లో అడుగుపెట్టారు.