Allu Arjun: ఫ్యాన్ వార్స్‌పై తగ్గేదే లే.. బన్నీ

ABN, Publish Date - Oct 12 , 2024 | 09:40 AM

కొన్ని నెలల క్రితం ఏపీలో జరిగిన ఎలక్షన్స్‌తో రగిలిన ఈ కార్చిచ్చుకి త్వరలోనే ఫుల్ స్టాప్ పడనున్నట్లు తెలుస్తోంది. దీన్ని సరిదిద్దటానికి ఏకంగా నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. ఆయనకు తోడుగా అల్లు అర్జున్ కొన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడట. ఇంతకీ ఏమైందంటే..

PushpaRaj

సినీ ఇండస్ట్రీలో గత కొంతకాలం నుండి మెగా - అల్లు ఫ్యామిలీ ఫ్యాన్ వార్స్ కలకలం రేపుతున్నాయి. ఇరు వర్గాలు తగ్గేదే లే.. అంటూ ట్రోలింగ్స్‌తో విరుచుకుపడుతున్నారు. దీంతో సినీ అభిమానుల్లో అనిశ్చితి నెలకొంది. కొన్ని నెలల క్రితం ఏపీలో జరిగిన ఎలక్షన్స్‌తో రగిలిన ఈ కార్చిచ్చుకి త్వరలోనే ఫుల్ స్టాప్ పడనున్నట్లు తెలుస్తోంది. దీన్ని సరిదిద్దటానికి ఏకంగా నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. ఆయనకు తోడుగా అల్లు అర్జున్ కొన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడట. ఇంతకీ ఏమైందంటే..


ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా - అల్లు ఫ్యామిలీ టాపిక్ హాట్ హాట్‌గా మారింది. కొన్ని నెలల క్రితం ఏపీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మేనమామ పవన్ కళ్యాణ్ పార్టీని కాదని.. స్నేహితుడికి సపోర్ట్‌గా ప్రచారం నిర్వహించారు. దీంతో మెగాస్టార్ లేకపోతే అల్లు అర్జున్ ఎక్కడంటూ ఒక వర్గం.. అల్లు రామలింగయ్య లేకపోతే చిరు ఎక్కడంటూ మరో వర్గం రాద్ధాంతం సృష్టించాయి. అలాగే బన్నీ మెగా ఫ్యామిలీని దూరం పెడుతూ.. అల్లు ఆర్మీ పేరుతో తన ఫ్యాన్స్‌ని రెచ్చగొడుతున్నాడని ఓ వర్గం ఆరోపణలు చేస్తోంది. ఇక మరోవైపు బన్నీ కట్టే కాలేంత వరకు చిరు ఫ్యాన్‌నే అంటూ చేసిన వ్యాఖ్యలు మరిచి అతిగా బిహేవ్ చేస్తున్నాడంటూ నాన్ సెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'ఆహా' ఓటీటీలో బాలకృష ఆన్ స్టాపబుల్ సీజన్ 4తో ఈ ఎపిసోడ్‌కి ముగింపు పలకాలని చూస్తున్నట్లు సమాచారం. ఆన్ స్టాపబుల్ 4 ఫస్ట్ ఎపిసోడ్‌లోనే బన్నీని గెస్ట్‌గా పిలిచి ఈ విషయంపై క్లారిటీ ఇప్పించనున్నట్లు సమాచారం.

Also Read- Viswam Review: గోపీచంద్‌, శ్రీను వైట్ల కాంబో ఫిల్మ్ ‘విశ్వం’ ఎలా ఉందంటే...

Also Read- Maa Nanna Superhero Review: సుధీర్‌బాబు నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందంటే..

Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌’ ఎలా ఉందంటే.. 

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 12 , 2024 | 09:40 AM