Balagam mogilaiah: బలగం మొగిలయ్య ఇకలేరు...

ABN, Publish Date - Dec 19 , 2024 | 08:06 AM

'బలగం’ (Balagam) చిత్రంలో 'తోడుగా మాతోడుండి’ పాటతో రెండు తెలుగు రాష్ట్రాలోను పాపులర్‌ అయ్యారు జానపద కళాకారుడు మొగిలయ్య. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు.


'బలగం’ (Balagam) చిత్రంలో 'తోడుగా మాతోడుండి’ పాటతో రెండు తెలుగు రాష్ట్రాలోను పాపులర్‌ అయ్యారు జానపద కళాకారుడు మొగిలయ్య(Balagam Mogilaiah). కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు.  కిడ్నీలు ఫెయిల్‌ అయ్యి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం తుది శ్వాస విడిచారు. మొగిలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితోపాటు గుండెకు సంబంధించిన సమస్యతో కూడా బాధపడుతున్నారు. జానపద గాయకుడిగా గుర్తింపు పొందిన మొగిలయ్య ఆ కళతోనే జీవితం సాగించేవారు. తన కళను గుర్తించిన దర్శకుడు వేణు యెల్దండి (venu Yeldandi) బలగం సినిమాలో  'తోడుగా మాతోడుండి’ పాట పాడే అవకాశం ఇచ్చారు. క్లైమాక్స్ లోని భావోద్వేగభరిత పాటతో మొగిలయ్య అందరి మన్ననలు పొందారు. దానితో పాపులర్‌ అవ్వడంతో ఆయనెవరో జనాలకు తెలిశారు.

ఆ తర్వాత కొన్నాళ్లకు మొగిలయ్య అనారోగ్యంతో పరిస్థితి విషమంగా మారిందనే వార్తలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించి చికిత్స అందించింది. హైదరాబాద్‌ తరలించి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించారు. దర్శకుడు వేణుతోపాటు మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఆర్థిక సాయం అందజేశారు. మొగిలయ్య మరణం పట్ల బలగం సినిమా డైరెక్టర్‌ వేణు యెల్డండి, నటీనటులు సంతాపం ప్రకటించారు. (Mogilaiah is no more)

Read Also:

Balagam Singer: బలగం గాయకుడికి ఎంత కష్టం... 11 చోట్ల రంధ్రాలు.. అయినా.. అదే సమస్య!

Balagam Mogilaya: మొగిలయ్య కష్టానికి స్పందించిన మంత్రి!


Updated Date - Dec 19 , 2024 | 08:24 AM