Samara Simha Reddy: మార్చి 2న.. బాలకృష్ణ అల్‌టైం బ్లాక్‌బస్టర్ రీరిలీజ్! ప్రత్యేకత ఏంటంటే?
ABN, Publish Date - Feb 26 , 2024 | 02:26 PM
నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో సమరసింహారెడ్డి సినిమా ఒకటి. ఈ చిత్రాన్ని మార్చి 2న మళ్లీ థీయేటర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో సమరసింహారెడ్డి (Samara Simha Reddy) సినిమా ఒకటి. శ్రీ మాతా క్రియేషన్స్ బ్యానర్ పై కే రఘురామిరెడ్డి, జి రవికాంత్ రెడ్డి సంయుక్తంగా సమరసింహారెడ్డి చిత్రాన్ని ఘనంగా రీ రిలీజ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను ఉర్రుతలూగించిన ఈ చిత్రం మార్చిన 2న మళ్లీ థీయేటర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది శ్రీ మాత క్రియేషన్స్. బి. గోపాల్ దర్శకత్వంలో ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఆ తరువాత ఫ్యాక్షన్ సినిమాలకు శ్రీకారం చుట్టింది.
1999లో సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపింది. విడుదలైన అన్ని ఏరియాల్లో బక్సాఫీసు రికార్డుల మోత మోగించి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఫ్యాక్షన్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన సమరసింహారెడ్డి (Samara Simha Reddy) రీరిలీజ్ వార్త బాలయ్య (Nandamuri Balakrishna) అభిమానులకు పండుగ లాంటి వార్త. సినిమా విడుదలైన 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ సినిమాను ఆయన అభిమానులు 4కే లో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి అభిమానులతో పాటు నందమూరి చైతన్య కృష్ణ (Nandamuri Chaitanya Krishna) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రీరిలీజ్ ట్రెండ్ వచ్చిన తరువాత నందమూరి బాలయ్య (Nandamuri Balakrishna) నటించిన నరసింహానాయుడు, చెన్నకేశవ రెడ్డి సినిమాలు విడుదలయ్యాయి కానీ వాటిని మించిన సినిమా సమరసింహా రెడ్డి (Samara Simha Reddy) అని నిర్వహకులు తెలిపారు. అప్పట్లోనే ఓ ట్రెండ్ సెట్ చేసి రికార్డులు సృష్టించిన ఈ సినిమా సరికొత్త డాల్బీ సౌండ్‌లో, 4కె ప్రింట్‌తో అదిరిపోతుందని వెల్లడించారు. చైతన్య కృష్ణ (Nandamuri Chaitanya Krishna) మాట్లాడుతూ.. బాబాయ్ సినిమా సమరసింహారెడ్డి (Samara Simha Reddy) రీరిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, నైజాంలో 100 థియేటర్లకు పైగా, ఆంధ్రాలో 250 పైగా, కర్ణాటకలో 50కి పైగా థియేటర్లో విడుదల చేయడం ఒక రికార్డు అని అన్నారు.
అప్పట్లో 1999లో సంక్రాంతి బరిలో నిలిచి, అంతకుముందు రికార్డులన్ని బద్దలు కొట్టిందని అన్నారు. నందమూరి బాలయ్య (Nandamuri Balakrishna) సీమకే సింహం అని అన్నారు. డ్యాన్స్ లో, ఫైట్లలో, డైలాగ్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారని పేర్కొన్నారు. అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు కూడా ట్రెండ్ సెట్ చేస్తుందని నిర్వాహకలు తెలిపారు. అప్పట్లో థియటర్లో మిస్ అయిన ఈ జనరేషన్ ఫ్యాన్స్ కు సమరసింహారెడ్డి (Samara Simha Reddy) ని ఇప్పుడు థియేటర్లో చూసే అవకాశం శ్రీ మాత క్రియేషన్స్ కలిపిస్తుందని తెలిపారు.