Vaishnavi Chaitanya: నా లైఫ్ ఎక్కడి నుంచి.. ఎక్కడికి వెళ్లిందో నాకేం అర్థం కావట్లే
ABN, Publish Date - Apr 10 , 2024 | 11:39 AM
ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా రూపొందిన హర్రర్ చిత్రం ‘లవ్ మీ’. మంగళవారం ఈ చిత్రం ఆడియో వేడుక ఘనంగా జరిగింది.. ఈ సందర్భంగా కథనాయిక వైష్ణవి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయింది.
టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. మంగళవారం ఈ సినిమా ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) మాట్లాడుతూ.. లవ్ మీ (Love Me) సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది.. ఎప్పుడు షూట్ అయింది.. ఎప్పుడు ఆడియో లాంచ్ వరకు వచ్చిందన్నది అర్థం కావడవ లేదు. చాలా ఫాస్ట్ గా జరిగింది మొత్తం. ఈ టీమ్ అంతా చాలా ఎనర్జిటిక్‌గా, ఫోకస్‌తో పనిచేశారు. వాళ్లందరినీ చూసి మోటివేట్ అయ్యేదాన్ని. నేనెంత అలిసిపోయినప్పటికీ, అందరి ఎనర్జీ చూసి హుషారు వచ్చేది.
ఈ లవ్ మీ (Love Me) సినిమాతో నేను చాలా నేర్చుకున్నాను. గతంలో ఆడియో లాంచ్ అంటే చాలా ఎనర్జీతో వెయిట్ చేసేవాళ్లం. నేనూ, మా అమ్మ ఓ ఆడియో లాంచ్‌కి వెళ్లి సినిమా వాళ్లని చూడ్డానికి దూరంగా నిలుచుని వెయిట్ చేశాం. ఇప్పుడు నా సెకండ్ సినిమా ఆడియో వేడుకకు ఇలాంటి గొప్ప వేదిక మీద ఉన్నాను. లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో తలచుకుంటుంటే అసలు నాకేం అర్థం కాలేదు. చాలా ఆనందంగా ఉన్నాను. సెకండ్ సినిమాకి ఇంత మంది పెద్ద వారితో పనిచేయడం మర్చిపోలేని అనుభూతినిస్తోంది.
అసలు ఈ లెజెండ్స్ అందరిదీ వేరే లోకం. వాళ్ల స్థాయికి అసలు రీచ్ కాలేమేమో అని అనుకునేదాన్ని. కానీ ఇవాళ వాళ్లందరి పక్కనా నేనున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కీరవాణి (Keeravaani) గారిని ఫస్ట్ కలిసినప్పుడు చాలా భయమేసింది. ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరక్టర్ ముందు కూర్చుని ఓ అన్ ప్రొఫెషనల్ అమ్మాయిగా ఓ పాట పాడాను. `నీ వాయిస్ బావుంది పిల్లా.. బాగా పాడుతున్నావు అని ఆయన అన్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. నన్ను పుష్ చేసి నాతో పాట పాడించారు కీరవాణి గారు. నా చిన్నప్పుడు అయ్యప్ప పూజల్లో భక్తి పాటలు పాడేదాన్ని.
పీసీ సార్ ఎవరికైనా ఫ్రేమ్ పెడితే వాళ్లు అదృష్టం చేసుకున్నారని అంటారు. ఇప్పుడు మా టీమ్ మొత్తం చాలా అదృష్టం చేసుకున్నది కాబట్టే, ఆయన ఈ సినిమాకు పని చేశారు. డిఫరెంట్ లవ్ స్టోరీ లవ్ మీ (Love Me). ఇది ఏప్రిల్ 25న సినిమా థియేటర్లలోకి వస్తోంది. యూనిక్ లవ్ స్టోరీ అని అందరూ మెచ్చుకుంటారు. హీరో ఆశిష్ (Ashish) చాలా స్వీట్ పర్సన్ అని తెలిపారు.