Theater Movies: ఈవారం సౌత్ ఇండియా థియేటర్లలో.. రిలీజవుతున్న సినిమాలివే!
ABN, Publish Date - Aug 01 , 2024 | 04:45 PM
ఆగస్టు మొదటి వారమే సౌత్ ఇండియా వ్యాప్తంగా అన్ని థియేటర్లలో వద్ద సినిమాల దండయాత్ర మొదలు అవ్వనుంది. ఒకటి కాదు రెండు కాదు ఓ 35కుపైగా సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.
ఆగస్టు మొదటి వారమే సౌత్ ఇండియా వ్యాప్తంగా అన్ని థియేటర్లలో సినిమాల దండయాత్ర మొదలు అవ్వనుంది. ఒకటి కాదు రెండు కాదు ఓ 35కుపైగా సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. వాటిలో తెలుగులో నాలుగైదు చిత్రాలు కాస్త పేరున్న నటుల సినిమాలు కావడం విశేషం.
ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు నటించిన శివం భజే (Shivam Bhaje) గురువారమే విడుదలవుతుండగా అల్లు శిరిష్ బడ్డీ (Buddy), రాజ్ తరుణ్ తిరగబడరా సామీ (Tiragabadara Saami), మల్లీశ్వరీ ఫేమ్ విజయ్ బాస్కర్ దర్శకత్వం వహించన ఉషా పరిణయం (Usha Parinayam)
చిత్రాలతో పాటు వరుణ్ సందేశ్ విరాజీ, అలనాటి రామ చంద్రుడు (Alanaati Ramachandrudu), లారీ చాప్టర్ 1 (Lorry Chapter 1), ఎవరేజ్ స్టూడెంట్ నాని (Average Student Nani ) వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఇక తమిళంలోనూ ఈ వారం అర డజన్ చిత్రాలు వస్తున్నాయి. వాటిలో.. విజయ్ అంటోని ‘మళైపిడిక్కాద మనిదన్’ (Mazhai Pidikatha Manithan), యోగిబాబు ‘బోట్’ (Boat), ‘జమా’ (Jama), ‘నన్బన్ వంద పిరగు’ (Nanban Oruvan Vantha Piragu), ‘పేచ్చి’ (Pechi), ‘వాస్కోడిగామ’ (Vasco Da Gama) వంటి సినిమాలున్నాయి. వీటిలో విజయ్ , యోగిబాబు - గౌరి కిషన్ జంటగా నటించిన ‘బోట్’ , కొత్త దర్శకుడు పారి ఇలవళగన్ స్వయంగా నటించి,దర్శకత్వం వహించిన ‘జమా’చిత్రాలపై భారీ అంచనాలున్నాయి.
అదేవిధంగా బాయ్స్ నకుల్ నటించిన ‘వాస్కోడిగామ’, బాలశరవణన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పేచ్చి’, ఆనంద్ దర్శకత్వం వహించి నటించిన ‘నన్బన్ ఒరువన్ వంద పిరగు’ వంటి చిత్రాలు కూడా మంచి సందేశాత్మక కంటెంట్, హాస్యభరిత చిత్రాలుగా రూపొందాయని, వాటిని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకాన్ని పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మిందీ, ఇంగ్లీష్‌లలో మూడేసి, మలయాళ, కన్నడ భాషల్లో ఒకటి, రెండే చొప్పున సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
Telugu
Shivam Bhaje Aug1
Buddy Aug2
Viraaji Aug2
Usha Parinayam Aug2
Lorry Chapter 1 Aug2
Tiragabadara Saami Aug2
Average Student Nani Aug2
Alanaati Ramachandrudu Aug2
Hindi
Ulajh Aug2
Bardovi Aug2
Auron Mein Kahan Dum Tha Aug2
English
Trap (2024) Aug2
Mothers' Instinct Aug 2
Korean
Project Silence Aug2
Tamil
Boat Aug2
Jama Aug2
Pechi Aug2
VascoDaGama Aug2
Mazhai Pidikatha Manithan Aug2
Nanban Oruvan Vantha Piragu Aug2
Kannada
Ishq Aug2
Adavi Katte Aug2
Malayalam
Adios Amigo Aug2