A Masterpiece: జూన్ 7న మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ సూపర్‌హీరో థ్రిల్లర్.. ఏ మాస్టర్ పీస్ సినిమా టీజర్
ABN, Publish Date - Jun 01 , 2024 | 11:38 AM
'శుక్ర', 'మాటరాని మౌనమిది' వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా "ఏ మాస్టర్ పీస్ . అరవింద్ కృష్ణ , జ్యోతి పూర్వాజ్, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. తాజాగా ఈ "ఏ మాస్టర్ పీస్" సినిమా టీజర్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.
'శుక్ర', 'మాటరాని మౌనమిది' వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ (Suku Purvaj) రూపొందిస్తున్న కొత్త సినిమా "ఏ మాస్టర్ పీస్ (A Masterpiece). అరవింద్ కృష్ణ (Arvind Krishna), జ్యోతి పూర్వాజ్(Jyoti Purvaj), అషు రెడ్డి లీడ్ (Ashu Reddy) రోల్స్ లో నటిస్తున్నారు.
మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో ఒక కొత్త కాన్సెప్ట్‌లో సూపర్ హీరో మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియో మెర్జ్ ఎక్స్ ఆర్ తో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ "ఏ మాస్టర్ పీస్" సినిమా టీజర్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. జూన్ 7వ తేదీ మధ్యాహ్నం 3.33 నిమిషాలకు టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అద్భుతమైన హై స్టాండర్డ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, భారీ మేకింగ్, విజువల్ ఎఫెక్టులతో ఈ సినిమాను దర్శకుడు సుకు పూర్వజ్ (Suku Purvaj) తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకోగా ఈ ఏడాదిలోనే "ఏ మాస్టర్ పీస్"(A Masterpiece) సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.