మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Yakshini: మగాళ్లు జాగ్ర‌త్త‌.. య‌క్షిణి వ‌చ్చేస్తోంది

ABN, Publish Date - May 21 , 2024 | 07:10 PM

ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ సూపర్ హిట్ కాంబినేషన్‌ మ‌రో ఆస‌క్తిక‌ర వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు రెడీ అయింది.. ఇప్పుడు ఈ కాంబోలో యక్షిణి అనే ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి.

yakshini

ఆర్కా మీడియా వర్క్స్ (Arka Mediaworks), డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) ది సూపర్ హిట్ కాంబినేషన్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు రెడీ అయింది.. ఈ సంస్థల క‌ల‌యిక‌లో గ‌తంలో వ‌చ్చిన‌ పరంపర, పరంపర 2 వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల్ని ఆకట్టుకుని విజయం సాధించాయి. ఇప్పుడు ఇదే కాంబోలో యక్షిణి (Yakshini) అనే మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్‌ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.

వేదిక (Vedhika), మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna), రాహుల్ విజయ్ (Rahul Vijay), అజయ్ (Ajay) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అర్జున ఫాల్గుణ, జోహార్, కోట బొమ్మాళి పీఎస్ వంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజ మార్ని (Teja Marni) "యక్షిణి" సిరీస్ ను రూపొందిస్తున్నారు. కృష్ణ, మాయ పాత్రలతో సోషియా ఫాంటసీ నేపథ్యాన్ని ఈ సిరీస్ కు ఎంచుకున్నారు దర్శకుడు తేజ మార్ని.


ఫాంటసీ, రొమాన్స్, కామెడీ అంశాలతో రూపొందిన ఈ "యక్షిణి" (Yakshini) ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. డైరెక్టర్ తేజ మార్ని విజన్ కు తగినట్లు భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఆర్కా మీడియా వర్క్స్ ఈ సిరీస్ ను నిర్మించింది. జూన్ లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో "యక్షిణి" (Yakshini) వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది.

Updated Date - May 21 , 2024 | 07:38 PM