Guntur Karam: ఏపీలో ‘గుంటూరు కారం’ టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్.. సలార్‌ను మించి
ABN, Publish Date - Jan 10 , 2024 | 09:53 PM
గత కొన్ని రోజులుగా మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం మరో రెండు రోజుల్లో థియేటర్లకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపునకు అనుమతినివ్వగా తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది.
గత కొన్ని రోజులుగా మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas ) కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం (Gunturu Kaaram) మరో రెండు రోజుల్లో థియేటర్లకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచగా నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహేశ్ బాబు ఎమోషనల్ స్పీచ్‌తో సినిమా స్థాయి అమాంతం రెట్టింపయింది.
అయితే ఈ సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో సందిగ్దాలు నెలకొన్న నేపథ్యంలో నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి వారం టికెట్ ధరలు పెంపునకు అనుమతి ఇచ్చింది. మల్టీ ప్లెక్స్ లో రూ. 100, సింగిల్ థియేటర్స్ లో రూ. 65 గా ధరలు నిర్ణయిస్తూ, అన్ని థియేటర్స్ లో ఓ ఉదయం 4 గంటల నుంచి ఆటలు వేసుకోవచ్చంటూ జీవో జారీ చేసింది.
అలాగే ఈనెల అంటే 11వ తేదీ అర్థరాత్రి (తెల్లవారితే 12వ తేదీ) కొన్ని థియేటర్స్ లో అర్థరాత్రి ఒంటి గంటకి ఈ సినిమా బెనిఫిట్ షోస్ వేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు. మొత్తం 23 థియేటర్స్ లలో (మల్టీ ప్లెక్స్, సింగిల్ థియేటర్స్ కలిపి) ఈ ఒంటి గంట బెనిఫిట్ షోస్ వేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
ఇదిలాఉండగా ఈ రోజు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గుంటూరు కారం (Gunturu Kaaram) సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంది. సినిమా విడుదల అనంతరం పది రోజుల పాటు రూ.50 పెంచుకోవడానికి అనుమతినిస్తూ జీవో జారీ చేసింది. అయితే సార్ సినిమాకు కేవలం రూ.25కే అనుమతి ఇచ్చి ఇప్పుడు ఈ సినిమాకు ఎక్కువ ఇవ్వడంపై నెట్టింట చర్చ నడుస్తోంది.