మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Anupama Parameswaran: బిర్యానీ ఇష్టమని రోజూ అదే పనిగా తింటామా?

ABN, Publish Date - Mar 19 , 2024 | 11:18 AM

'మీకు బిర్యానీ అంటే ఇష్టమా? ప్రతిరోజూ ఇంట్లో బిర్యానీ తింటారా? లేదు కదా! అలానే నేను కూడా ప్రతిరోజూ బిర్యానీ తినాలని కోరుకోవడం లేదు. నాకు కూడా డిఫరెంట్‌ పులావ్‌ కావాలి, పులిహోర కావాలి అన్నీ కావాలి’

'మీకు బిర్యానీ అంటే ఇష్టమా?
ప్రతిరోజూ ఇంట్లో బిర్యానీ తింటారా? లేదు కదా!
అలానే నేను కూడా ప్రతిరోజూ బిర్యానీ తినాలని కోరుకోవడం లేదు.
నాకు కూడా డిఫరెంట్‌ పులావ్‌ కావాలి, పులిహోర కావాలి అన్నీ కావాలి’
గ్లామర్‌ డోస్‌ బాగా పెంచినట్టున్నారు అన్న ప్రశ్నకు ఇలా సెటైరికల్‌గా సమాధానం చెప్పింది మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్.

సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన 'టిల్లు స్వ్కేర్‌’ సాంగ్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో అనుపమా పాల్గొన్నారు. ‘అఆ’, 'శతమానం భవతి’ తదితర చిత్రాల్లో క్లాస్‌గా కనిపించిన అనుపమ.. ఇప్పుడు  ఈ చిత్రం  కోసం గ్లామర్‌ డోస్‌ పెంచింది. ముద్దు సన్నివేశాలు, స్కిన్  షో విషయంలో ఎలాంటి అడ్డు చెప్పలేదని టీజర్‌, పాటలు చుస్తే అర్థమవుతోంది. ఈ విషయం గురించి ప్రస్తావించగా ఆమె ఇలా చెప్పింది.

"అందంగా కనిపించడం మంచిదే కదా. నా కెరీర్‌లో నేను పోషించిన పాత్రల్లో లిల్లీ ప్రత్యేకం. మూడేళ్ల క్రితం ప్రయోగాత్మక పాత్రల్లో నటించడం ప్రారంభించా. అంతకుముందు నాకున్న పరిధుల దృష్ట్యా కొన్ని క్యారెక్టర్లు చేయలేకపోయా. అన్ని చిత్రాల్లో ఒకేలాంటి పాత్రల్లో నటించడంతో బోర్‌ ఫీలయ్యా. యాక్టర్‌గా ఇన్నేళ్లలో చేసిన క్యారెక్టర్స్‌ మళ్లీ మళ్లీ చేస్తుంటే బోర్‌ కొడుతుంది’’ అని అన్నారు.



అంతే కాదు ఈ లిల్లీ పాత్ర కోసం మొదట్లో చాలామంది హీరోయిన్ల పేరు వినిపించాయి. వాళ్లెందుకు చేయలేదో తెలుసుకుని ఈ సినిమా అంగీకరించారా? లేక కథ నచ్చి నటించారా? అన్న ప్రశ్నకు "నాకు చెప్పిన కథ నచ్చింది. ఈ మూవీలో లిల్లీ పాత్ర వదులుకోవడం అంత పిచ్చి పని మరొకటి ఉండదు. ఎందుకంటే కమర్షియల్‌ సినిమాలో అమ్మాయికి ఇంత మంచి పాత్ర  దొరకదు. అందుకే వదులుకోవాలని అనుకోలేదు.  మిగతా విషయాలు తెలియదు. ఏదైనా నటనకు స్కోప్‌ ఉంటేనే చేస్తా? తప్ప హీరోయిన్‌ ఇమేజ్‌ కోసం కాదు.


Updated Date - Mar 19 , 2024 | 11:18 AM