మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Anasuya Bharadwaj: నాకు సింపతి అక్కర్లేదు

ABN, Publish Date - Apr 04 , 2024 | 07:50 PM

అనసూయ భరద్వాజ్‌(Anasuya Bharawaj) సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. అప్పుడప్పుడు సొసైటీలో జరిగే అన్యాయాల మీద మాట్లాడుతూ ట్రోలింగ్‌కు గురవుతుంటారు. తాజాగా ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌కు అనసూయ తనదైన స్టైల్‌లో స్పందించింది

అనసూయ భరద్వాజ్‌(Anasuya Bharawaj) సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. అప్పుడప్పుడు సొసైటీలో జరిగే అన్యాయాల మీద మాట్లాడుతూ ట్రోలింగ్‌కు గురవుతుంటారు. తాజాగా ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌కు అనసూయ తనదైన స్టైల్‌లో స్పందించింది. మీకు, నాకు ఎలాంటి రిలేషన్‌ లేదంటూనే కాస్తా వ్యంగ్యంగానే వ్యాఖ్యానించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ నెటిజన్‌ విజయ్‌ దేవరకొండను (Vijay devarakonda) ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో అనసూయను ఆంటీ అని ప్రస్తావించాడు. ఇది చూసిన అనసూయ తనదైన స్టైల్లో కౌంటర్‌ ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ టాపిక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


‘‘ఎందుకు కార్తీక్‌ (karthik netizen) అస్తమానం నన్ను లాగుతారు. ఎవరు ఏం మాఫియా చేస్తున్నారో నేను ఎప్పుడో చెప్పి చెప్పి వదిలేశాను. అనవసరంగా నేనే హైప్‌ ఇస్తున్నానని మా వాళ్లు అంటుంటే నిజమేనేమో అని వదిలేశాను. నేను కూడా తెలంగాణ బిడ్డనే. కానీ నాకు సింపతి అక్కర్లేదు. నాకు నా మీద నమ్మకం. నా దేవుడి మీద నమ్మకం. మా అమ్మ, నాన్నలు నాకు ఇచ్చిన విలువలు, పెంపకం నన్ను నా దృష్టిలో ఎప్పుడు దిగజారనివ్వవు. ఇప్పుడు ఈ ట్వీట్‌ను కూడా తమ స్వార్థానికి వాడుకున్న నేను ఆశ్చర్యపోను. కానీ నాకు, వాళ్లకి ఎటువంటి సంబంధం అప్పుడు లేదు. ఇప్పుడు లేదు. అన్నట్లు నాకు తెలిసి మీరు, నేను చుట్టాలు అస్సలు కాదండి. సో నేను నీకు ఆంటీ కానేమో.. అయినా ఒకసారి మీ ఇంట్లో అడగండి? మీకు తెలియకుండా ఏమైనా రిలేషన్స్‌ ఉన్నాయోమో?..

ఎందుకంటే నాకు చుట్టాలైతేనే ఆ పలకరింపులు ఉంటాయని మా పెద్దలు నేర్పించారు. ఏదేమైనా మీకు అంతా మంచే జరగాలి అండి’’ అంటూ పోస్ట్‌ చేసింది. గతంలో సోషల్‌ మీడియాలో విజయ్‌ దేవరకొండ ష్యాన్స్‌కి తనకు మధ్య జరిగిన ట్విటర్‌ వార్‌పై కూడా  అనసూయ భరద్వాజ్‌ స్పందించింది.  విజయ్‌ దేవరకొండ డబ్బులిచ్చి మరి నన్ను తిట్టించాడని తెలిసి చాలా బాధ పడ్డానని ఆమె పేర్కొంది. గతంలో విమానం సినిమా సక్సెస్‌ మీట్‌లో మాట్లాడుతూ.. నాకు పీఆర్‌ టీమ్‌ లేదు. ఏదైనా నేనే మాట్లాడుతా.. ట్వీట్స్‌ కూడా నేనే చేశా. కానీ ఇకపై ఈ వివాదానికి దూరంగా ఉండాలనుకుంటున్నా.. అని అనసూయ చెప్పుకొచ్చింది.  

Updated Date - Apr 04 , 2024 | 07:56 PM