Pottel: దీపావ‌ళికి వ‌స్తున్న‌.. అనన్య నాగళ్ల 'పొట్టేల్'

ABN, Publish Date - Oct 08 , 2024 | 08:02 AM

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంట‌గా నటించిన చిత్రం పొట్టెల్. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన టీజ‌ర్, పోస్ట‌ర్లు, పాట‌లు మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

pottel

యువ చంద్ర కృష్ణ (Yuva Chandraa), అనన్య నాగళ్ల (Ananya Nagalla) జంట‌గా నటించిన చిత్రం పొట్టెల్ (Pottel Movie). సాహిత్ మోత్ఖూరి (Sahit mothkhuri) దర్శకత్వం వ‌హించారు. NISA ఎంటర్టైన్మెంట్స్ (NISA ENTERTAINMENTS) ప‌తాకంపై నిశాంక్ రెడ్డి కుడితి మరియు ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్పై సురేష్ కుమార్ సడిగే నిర్మించారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన టీజ‌ర్, పోస్ట‌ర్లు, పాట‌లు మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా ఈ సినిమా టీజ‌ర్‌ను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (SandeepReddyVanga) రిలీజ్ చేసి మెచ్చుకోవ‌డం విశేషం.

తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ పొట్టేల్ (Pottel Movie) సినిమాను అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. కాగా మంగళవారం (అక్టోబర్ 29) దీపావళి సెలవు సినిమాకి అడ్వాంటేజ్ కానుంది. ఈమేర‌కు యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, వారి కుమార్తె ఉన్న లుక్‌, మరో పార్ట్ లో హీరోని గ్రామస్తులు వెంబడిస్తున్నట్లు ఉండే లుక్‌తో రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ చేశారు.


రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ పొట్టేల్' (Pottel Movie)మూవీ తెర‌కెక్కింది. కుల వివక్ష బాగా ఉన్న మారుమూల తెలంగాణ గ్రామంలో తన కుమార్తెకు మంచి చ‌దువు, జీవితాన్ని అందించాలని కోరుకునే తండ్రిగా హీరో యువ చంద్రకృష్ణ కనిపించాడు. అదే స‌మ‌యంలో ఆ ఊరికి పవిత్రమైన గొర్రె తప్పిపోవ‌డంతో గ్రామస్థులు అతనిపై దాడి చేయడం వంటి ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలతో ఓ థ్రిల్ల‌ర్‌గా సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టుడు అజయ్ ఇంపార్టెంట్, పవర్ ఫుల్ రోల్ పోషిస్తుండ‌గా మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Updated Date - Oct 08 , 2024 | 08:02 AM